భాగ్యలక్ష్మి ఆత్మహత్య: భర్త సహా నలుగురి అరెస్టు, కట్నం కోసమే వేధింపులు
పెళ్ళిరోజునే ఆత్మహత్య చేసుకొన్న గృహిణి భాగ్యలక్ష్మి కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.వరకట్నం వేధింపుల వల్లే భాగ్యలక్ష్మి ఆత్మహత్య చేసుకొందని పోలీసులు తెలిపారు.
హైదరాబాద్:పెళ్ళిరోజునే ఆత్మహత్య చేసుకొన్న గృహిణి భాగ్యలక్ష్మి కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.వరకట్నం వేధింపుల వల్లే భాగ్యలక్ష్మి ఆత్మహత్య చేసుకొందని పోలీసులు తెలిపారు.
రైల్వే ఉద్యోగిని భాగ్యలక్ష్మి హైద్రాబాద్ బేగంపేటలో ఈ నెల 25వ, తేదిన ఆత్మహత్య చేసుకొంది.భాగ్యలక్ష్మి గూగుల్ ఉద్యోగి శశిధర్ ను ప్రేమించి గత ఏడాది మార్చి 25వ, తేదిన వివాహం చేసుకొంది.
అయితే శశిధర్ తో వివాహమైన రోజు నుండి భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని ఆమె గత ఏడాది అక్టోబర్ 28న మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

అదే రోజు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. కౌన్సిలింగ్ తర్వాత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు.అదనపు కట్నం కోసం వేధింపులు తాళలేక ఆమె వివాహ వార్షికోత్సవం రోజునే ఈ నెల 25న, ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది.
అయితే ఈ కేసులో భాగ్యలక్ష్మి భర్త శశిధర్ , అత్త మంజుల, మామ భాస్కర్ ,చిన్నత్త రమణీలను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.












Click it and Unblock the Notifications