వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులు: నిర్వాహకుల అరెస్ట్

హసన్‌పర్తి మండలం సిద్ధాపూర్‌ గ్రామంలోని వ్యభిచార గృహాలపై గురువారం సాయంత్రం హసన్‌పర్తి పోలీసులు దాడులు నిర్వహించారు.

వరంగల్‌: హసన్‌పర్తి మండలం సిద్ధాపూర్‌ గ్రామంలోని వ్యభిచార గృహాలపై గురువారం సాయంత్రం హసన్‌పర్తి పోలీసులు దాడులు నిర్వహించారు. హసన్‌పర్తి ఇన్స్‌పెక్టర్‌ పుల్యాల కిషన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్ధాపూర్‌కు చెందిన ములుగు పోశాలు, ముసుగు సీత, ముసుగు రఘు, సిరిసిల్లకు చెందిన స్వాతిలు కలిసి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువతిని తీసుకవచ్చి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు.

సమాచారం తెలుసుకున్న ఇన్‌స్పెక్టర్‌ కిషన్‌ నేతృత్వంలో పోలీసు బలగాలతో దాడులు నిర్వహించామన్నారు. యువతిని, నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నామని, యువతిని హన్మకొండలోని సాధికారిత గృహానికి తరలించామని తెలిపారు. నిర్వాహకులపై వ్యభిచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కన్నూరులో కుల బహిష్కరణ: పోలీసులకు ఫిర్యాదు

కుల పెద్దలను పిలువకుండా కూతురికి వరపూజ ఎలా చేస్తారని ఆగ్రహంతో కుల పెద్దలు ఓ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారు. బాధితులు గురువారం మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... కమలాపూర్‌ మండలంలోని కన్నూరు గ్రామానికి చెందిన వెంగళ రమేష్‌-పద్మ దంపతుల కూతురు సరితకు కమలాపూర్‌కు చెందిన గణేష్‌తో డిసెంబర్‌ 4న వివాహం జరిగింది.

Police attacked on brothel: organisers arrested

తమకు తెలియకుండా వరపూజ ఎలా చేశారని ఆగ్రహంతో కుల పెద్దలు కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారని రమేష్‌ తెలిపారు. అల్లుడికి వరపూజ చేయలేదని చెప్పినా వినకుండా కుల పెద్దలు తన కూతురి పెళ్లికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇటీవల తమ కులానికి చెందిన రేకుల రవి ఇంట్లో జరిగిన పెళ్లికి వెళితే... తమని కులపెద్దలు అకారణంగా దూషించారని బాధితులు ఆదేదన వ్యక్తం చేశారు. ఎవరైనా తమ ఇంటికి వస్తే రూ. 5 వేల జరిమానా చెల్లించాలని కుల పెద్దలు హుకూం జారీ చేశారని తెలిపారు. కుల బహిష్కరణ చేసిన పెద్దలపై చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.

కాలువలో గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం

హన్మకొండ మండలం గుండ్లసింగారంలోని ఎస్సారెస్పీ కాలువలోకి బుధవారం ఈతకు వెళ్లి గల్లంతైన హైదరాబాద్‌ జుబ్లీహిల్స్‌ ప్రాంతానికి చెందిన కేయూ ఇంజినీరింగ్‌ కళాశాల ఈఈఈ ప్రథమ సంవత్సర విద్యార్థి కార్తీక్‌ (18) మృతదేహన్ని గజ ఈతగాళ్లు గురువారం తెల్లవారుజామున వెలికి తీశారు.

కాలువలోంచి బయటకు తీసిన మృతదేహానికి ఎంజీఎం ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు కేయూసీ పోలీసులు తెలిపారు. కేయూ వీసీ సాయన్న, రిజిస్ట్రర్‌ రంగారావు, కేయూ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ మల్లారెడ్డి, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు ఘటనా స్థలంలో కార్తిక్‌ మృతదేహన్ని చూసి కంటతడి పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+