రూటు మార్చిన పేకాటరాయుళ్లు: కదిలే కార్లను క్లబ్బులుగా..!
హైదరాబాద్: నగరంలో పేకాట క్లబ్బులపై ఇటీవల కాలంలో పోలీసులు దాడులు ముమ్మరమయ్యాయి. దీంతో పేకాట మానేయాలా? అనుకున్నారో, ఏమో తేలీదు గానీ, పేకాట రాయుళ్లు మాత్రం కొత్త స్ధావరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఇల్లు కంటే కదిలే కారు పదిలమనుకున్నారు. అనుకున్నదే తడవగా కార్లనే క్లబ్బులుగా మార్చుకున్నారు. అయితే 'కదిలే క్లబ్బు'లపై కూడా పోలీసులు దాడులు చేసి మరీ పట్టుకున్నారు. హైదరాబాద్‌లోని వనస్ధలిపురంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది.

వనస్థలిపురం చింతలకుంటలో ఇన్నోవా (ఏపీ 29 క్యూ 8649), స్కార్పియో (ఏపీ 10 ఏఎస్ 4771) కార్లలో ఏడుగురు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు ఆదివారం సమాచారం వచ్చింది. ఈ విషయం తెలిసిన పోలీసులు రెండు వాహనాలపైనా ఆకస్మిక దాడులు చేశారు.
ఈ దాడిలో ఏడుగురిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 89,940, ఏడు సెల్ ఫోన్లతోపాటు ఇన్నోవా, స్కార్పియో కార్లను స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications