మిస్టరీ వీడింది: డబ్బుకోసమే బ్యాంకు సీఈవోపై ఎటాక్..

సీఈవోను ఎటాక్ చేయాలన్న ముందస్తు పథకం ప్రకారం.. మన్మథ్‌పై దాడి చేసేందుకు బిహార్‌లో ఒక దేశవాళి తుపాకీని కూడా నిందితులు కొనుగోలు చేశారు.

హైదరాబాద్‌: నగరంలోని మాసాబ్‌ట్యాంక్ కృష్ణా బీమా సమృద్ధి ప్రాంతీయ బ్యాంక్ (కెబిఎస్) సిఇవో మన్మథ్ దలైపై జరిగిన కాల్పులు కలకలం రేపిన సంగతి తెలిసిందే.పోలీసులు ఈ కేసు మిస్టరీని ఛేదించారు. కాల్పులకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

Police chased the mystery of attack on Manmath Dalai

నిందితులు ఎవరు?:

ఆదివారం నాడు నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తన కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితులను నెల్లూరు జిల్లా తడ గ్రామానికి చెందిన అబ్దుల్ రహీం, హైదరాబాద్‌కు చెందిన నరేష్, రాజేందర్, వెంకటరత్నంగా గుర్తించినట్టు కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. నిందితులు

Police chased the mystery of attack on Manmath Dalai

డబ్బు ఆశతోనే..దురాగతం:

నిందితులంతా టీ షాపు నడుపుకుంటూ జీవనం సాగించేవారని కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. పెద్ద మొత్తంలో డబ్బు పోగేయాలన్న దురాశతో బ్యాంక్ సీఈవోను వీరు టార్గెట్ చేసినట్టుగా కమిషనర్ పేర్కొన్నారు.

ఇదే క్రమంలో.. బ్యాంక్ సీఈవో వద్ద డబ్బు దోచుకోవడం కోసం వెళ్లారు. అయితే ఆయన వద్ద డబ్బు లేదని తేలడంతో కాల్పులు జరిపి అక్కడినుంచి పరారయ్యారు. సీఈవో మన్మథ్ వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న వెంకటరత్నం నిందితులకు ఆయన కదలికలపై సమాచారం అందించినట్టుగా వెల్లడించారు.

Police chased the mystery of attack on Manmath Dalai

బిహార్‌లో దేశీ తుపాకీ కొని..

సీఈవోను ఎటాక్ చేయాలన్న ముందస్తు పథకం ప్రకారం.. మన్మథ్‌పై దాడి చేసేందుకు బిహార్‌లో ఒక దేశవాళి తుపాకీని కూడా నిందితులు కొనుగోలు చేశారు. పథకం ప్రకారం బ్యాంక్ సిఇవో ఇంటికి వెళ్లి డబ్బు కోసం బెదిరించారు. కాగా, తన వద్ద డబ్బు లేదని సీఈవో చెప్పడంతో తీవ్ర ఆవేశంతో కాల్పులు జరిపి అక్కడినుంచి పరారయ్యారు.

ఈ కాల్పుల్లో బ్యాంక్ సీఈవో మన్మథ్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి. టెక్నాలజీతో సహాయంతో కేసు మిస్టరీని చేధించగలిగామని కమిషనర్ తెలియజేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన అనంతరం వారి వద్ద నుంచి దేశవాళీ తుపాకీ, 12 బుల్లెట్లు, హోండా యాక్టివా బైక్ ను స్వాధీనం చేసుకున్నామని అన్నారు.

ప్రస్తుతం పరారీలో ఉన్న మరో నిందితుడు వెంకటరత్నం కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్టు కమిషనర్ మహేందర్‌రెడ్డి వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+