చిరంజీవి బ్లడ్ బ్యాంకులో గోల్‌మాల్! జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవికి చెందిన బ్లడ్ బ్యాంకులో గోల్ మాల్ జరిగింది! ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఉన్న విషయం తెలిసిందే.

ఈ బ్లడ్ బ్యాంకులో పని చేస్తున్న ఉద్యోగి చీటింగ్‌కు పాల్పడ్డాడు. దీంతో నిర్వాహకులు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన ఇటీవల వెలుగు చూడటంతో, బుధవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఉద్యోగి చేతివాటం

ఉద్యోగి చేతివాటం

చిరంజీవి బ్లడ్ బ్యాంకులో పెద్ద ఎత్తున దాతలు రక్తదానం చేస్తుంటారు. రక్తదానం చేసిన తర్వాత జ్యూస్, పండ్ల వ్యవహారంలో సదరు ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. ఈ విషయాన్ని నిర్వాహకులు గుర్తించారు.

నాలుగేళ్లుగా అధిక బిల్లులు

నాలుగేళ్లుగా అధిక బిల్లులు

సదరు ఉద్యోగి గత నాలుగేళ్లుగా బ్లడ్ బ్యాంకులో ఇస్తున్న పండ్లు, జ్యూస్ విషయంలో అధికంగా బిల్లు వేసి డబ్బులు తీసుకుంటున్నారని గుర్తించారు. ఈ విషయంలో వారికి క్లారిటీ రావడంతో నిర్వాహకులు స్వామినాయుడు జుబ్లీహిల్స్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు.

రూ.5 లక్షల మేర టోపీ

రూ.5 లక్షల మేర టోపీ

నిందితుడు నాలుగేళ్లుగా రూ.5 లక్షల మేర కాజేసినట్లుగా గుర్తించారు. నిందితుడు చిరంజీవి బ్లడ్ బ్యాంకులో అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. నిందితుడిపై మౌఖికంగా ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.

Recommended Video

    Chiranjeevi A Big Minus For Pawan Kalyan | Oneindia Telugu
    తప్పుడు లెక్కలు రాసి

    తప్పుడు లెక్కలు రాసి

    దాతలకు ఇచ్చే ఫ్రూటీ, పండ్లు, జ్యూస్ తదితర కొనుగోలు విషయంలో చాలా కాలంగా అతను తప్పుడు లెక్కలు రాసినట్లు గుర్తించిన నిర్వాహకులు.. లెక్కల్లో తేడాపై అతనిని ప్రశ్నించి, ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+