మద్యం తాగి చిందేసిన ఫైర్‌మెన్లు.. సస్పెండ్(ఫోటో)
హైదరాబాద్: ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ అగ్ని ప్రమాదాలు జరిగితే శరవేగంగా చేరుకోవాల్సిన అగ్నిమాపక సిబ్బంది తమ కార్యాలయంలోనే మద్యం సేవించి డ్యాన్సులు చేశారు. దీనికి సంబంధించిన వీడియో శనివారం మీడియాలో రావడంతో ఉన్నతాధికారులు ఐదుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు.
తార్నాకలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) వద్ద ఉన్న మౌలాలి అగ్నిమాపక కేంద్రం సిబ్బంది కార్యాలయంలోనే ఈ వ్వవహారం చోటు చేసుకుంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుుకొని డిసెంబర్ 31 అర్ధరాత్రి మద్యం తాగారు.

ఆ మత్తులో అందరూ డ్యాన్సులు చేశారు.
వారిలో లీడింగ్ ఫైర్‌మెన్ అమర్ నాథ్ గౌడ్, డ్రైవర్ వీరస్మామితో పాటు ఫైర్ మెన్లు ఓం నమశ్సివాయ, సుర్జిత్ ఉన్నారు. దీనిని ఎవరో సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు. శనివారం ఈ వీడియో మీడియాలో ప్రసారమైంది. దీంతో తూర్పు డివిజన్ డీఎఫ్‌ఓ పాపయ్య ఆ నలుగురిని సస్సెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
అసెంబ్లీ అగ్నిమాపక కేంద్రం నుంచి అదనపు విధులపై మౌలాలి కేంద్రానికి వెళ్లిన మల్లేష్ అనే రైటర్ ఆ స్ధలంలో ఉండడంతో ఆయన్ని కూడా సస్పెండ్ చేశారు. డీఎఫ్‌ఓ పాపయ్య మాట్లాడుతూ వారు మద్యం తాగారా? లేదా? కేవలం నృత్యం చేశారా అన్నది దర్యాప్తులో బయటపడుతుందని అన్నారు.












Click it and Unblock the Notifications