అల్లు అర్జున్‌కు రేవంత్ రెడ్డి సర్కార్ మరో షాక్..చంద్రబాబు పేరు చెప్పి

తెలంగాణ పోలీసులు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు మరో షాకిచ్చారు. ఆ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన 'పుష్ప-2' సినిమా ప్రీమియర్ షోస్ రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ తొక్కిసలాట ఏర్పడింది. ఈక్రమంలో రేవతి అనే ఓ మహిళ మరణించారు. రేవతి కుమారుడు శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రి పాలయ్యాడు. ఈ విషయంలో అల్లు అర్జున్‌తో పాటు, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి.

ఈ ఘటనలో అల్లు అర్జున్‌పై ఎఫ్ఐర్ నమోదు కావడంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఒక రాత్రి ఆయన చర్లపల్లి జైలులోనే గడపాల్సి వచ్చింది. భారీ ట్విస్ట్‌ల మధ్య అల్లు అర్జున్ బెయిల్‌పై బయటకు వచ్చారు. తాజాగా మరోసారి అల్లు అర్జున్ అతిథిగా వస్తోన్న ఈవెంట్‌కు హైదరాబాద్ పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. దీనికి గల కారణాలను కూడా పోలీసులు వివరించారు.అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తోన్న తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం నిర్వహించడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేశారు.

Police did not give permission for the pre-release event of Naga Chaitanya movie Thandel

ఈ ఈవెంట్‌కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాబోతున్నారని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే తండేల్ ఈవెంట్‌కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు రావడంతో సీఎం చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి గ్రాండ్‌గా పార్టీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని చంద్రబాబుకు చెందిన ఫాంహోస్‌లో ఈ పార్టీ జరగనుంది.

ఈ పార్టీకి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు నందమూరి, నారా కుటుంబ సన్నిహితులు, బంధువులందరూ హాజరు కానున్నారు. అలాగే ఇండస్ట్రీకి చెందిన కొందరు దర్శక, నిర్మాతలకు కూడా ఈ పార్టీకి రానున్నారు. ఈ పార్టీ సినిమా ఈవెంట్ కాకపోయినా, అభిమానులు రాకపోయినా, ఒకే రోజు రెండు సినీ ఈవెంట్లకు అనుమతి ఇవ్వడం కుదరదని చెప్పడంతో తండేల్ ఈవెంట్ వాయిదా వేశారని సమాచారం.పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం సాయంత్రానికి వాయిదా వేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+