వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసు డ్యూటీ అంటే ఛాలెంజ్.!పోలీసులకు సేవా పతకాలు అందజేసిన సైబరాబాద్ సీపీ.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : పోలీసు శాఖలో అత్యుత్తమ సేవలందించిన 174 మంది సిబ్బందికి సేవా పతకాలు, ఉత్కృష్ట, అతి ఉత్తిష్ఠ సేవా పధకాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అందజేసారు. పోలీసు విధి నిర్వహణలో అత్యత్తమ ప్రతిభ కనపరిచిన 120 మందికి పోలీసు అధికారులకు సేవా పతకాలను స్టీఫెన్ రవీంద్ర అందజేసారు.

37 మంది పోలీసులకు ఉత్క్రుష్ట, 17 మందికి అతి ఉత్క్రుష్ట సేవా పతకాలను బహూకరించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలను సాధించాలని కమీషనర్ ఆకాంక్షించారు. విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు శాఖతో సహా, ఇతర శాఖలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సేవా పతకాలను ప్రకటిస్తాయని, అయితే 2015 సంవత్సరం నుంచి 2021 సంవత్సరానికి గాను ప్రకటించిన పథకాల బహూకరణ ఉన్నాయని తెలుస్తోంది. అలా పెండింగ్ లో ఉన్న సేవా పతకాలను బుదవారం సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., చేతులమీదుగా సిబ్బంది అందుకున్నారు.

Police duty means challenge.!Cyberabad CP who presented service medals to the police.

మొత్తం 174 మంది అధికారులకి గాను, 120 మంది పోలీసులకు సేవ పతకాలు వరించాయి. 37 మంది పోలీసులకు ఉత్క్రుష్ట సేవా పతకాలు, 17 మందికి అతి ఉత్క్రుష్ట పోలీస్ సేవా పతకాలు వరించాయి. సేవా పతకాలు అందుకున్న వారిలో పోలీస్ కానిస్టేబుల్ నుంచి ఏసీపీ ర్యాంక్ వరకూ ఉన్నారన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రజా రక్షణ, విధి నిర్వహణలో అసామాన్యమైన ప్రతిభను కనబర్చిన పోలీస్ సిబ్బందికి గుర్తింపునిచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సేవా పతకాలను ఇస్తాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు, కొత్త సంవత్సరంలో ఈ పతకాలను అందజేస్తుందన్నారు.

Police duty means challenge.!Cyberabad CP who presented service medals to the police.

Recommended Video

Tirumala Ghat Road Damaged | Cyclone Jawad And AP Rains Update | AP Weather || Oneindia Telugu

తానూ పోలీస్ కుటుంబంలో నుంచి వచ్చినవాడినని, మెడల్ సాధించినప్పుడు ఆనందం ఎలా ఉంటుందని తెలుసన్నారు. కుటుంబ సభ్యుల సహకారం లేనిది విధుల్లో ఉత్తమ పనితీరు కనబర్చడం సాధ్యం కాదన్నారు. అవార్డు అందుకున్న వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డిసిపి అనసూయ, సైబరాబాద్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ రియాజ్, సీఏఆర్ సీఎస్ డబ్ల్యూ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ వెంకట్ రెడ్డి, సీఏఓ గీత, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.

English summary
Out of a total of 174 officers, 120 policemen were awarded service medals. 37 policemen were awarded the Distinguished Service Medals and 17 were awarded the Outstanding Police Service Medals. Recipients of service medals range from police constables to ACP ranks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X