హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వాళ్లే ఎందుకు?: హైదరాబాద్ సెక్స్ రాకెట్‌ల వెనుక 'ట్రాప్', బ్రోకర్ల ఉచ్చులో విదేశీ యువతులు

చదువు కోసం వచ్చే ఇక్కడికి వచ్చే విదేశీ యువతులు బ్రోకర్ల ట్రాప్ లో పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో ఇటీవల పట్టుబడుతున్న వ్యభిచార ముఠాల్లో ఎక్కువమంది విదేశీ యువతులే ఉండటం పలు అనుమానాలకు తావిచ్చింది. విదేశాల నుంచి వీరు వ్యభిచారం కోసమే ఇక్కడికి వస్తున్నారా? లేక ఇక్కడికి వచ్చాక మరెవరైనా ఈ ఊబిలోకి వీరిని లాగుతున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఈ కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులకు పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. నిజానికి చదువు కోసం వచ్చే ఇక్కడికి వచ్చే విదేశీ యువతులు బ్రోకర్ల ట్రాప్ లో పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒకసారి ఆ రొంపిలోకి దిగాక.. తిరిగి వెనక్కి వెళ్తానంటే బ్రోకర్లు చంపేస్తామని బెదిరిస్తున్నట్లుగా గుర్తించారు.

 అసలేం జరుగుతోంది:

అసలేం జరుగుతోంది:

ఇటీవలి పోలీసుల దాడుల్లో మసాజ్‌ ముసుగులో వ్యభిచారం చేస్తూ 34 మంది థాయిలాండ్‌ యువతులు పట్టుబడ్డ సంగతి తెలిసిందే. వీరితో పాటు హైదరాబాద్‌ సందర్శనకు వచ్చిన ఇద్దరు టాంజానియా మహిళలు కూడా ఇక్కడి ఆర్గనైజర్ల వలలో చిక్కుకుని వ్యభిచారంలోకి బలవంతంగా లాగబడ్డారు.

ఓ బంగ్లాదేశీ మహిళ కుటుంబ పోషణ నిమిత్తం ఈ రొంపిలోకి దిగాల్సి వచ్చింది. వీళ్లంతా ఇటీవలి దాడుల్లో పట్టుబడ్డారు. వ్యభిచార గృహాల్లో వరుసగా విదేశీ యువతులే పట్టుబడుతుండటంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. దీంతో పలు కొత్త విషయాలు వెలుగుచూశాయి.

 విదేశీ యువతులపై నిఘా:

విదేశీ యువతులపై నిఘా:

వ్యభిచార ముఠాల్లో విదేశీ యువతులే ఎక్కువగా పట్టుబడుతుండటంతో.. నగరంలో ఉంటున్న విదేశీ యువతులపై పోలీసులు నిఘా పెట్టారు. ఇందుకోసం ఇంటెలిజెన్స్‌ బ్యూరో సహకారం తీసుకుంటున్నారు. వారిలో అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నవారి గురించి ఎప్పటికప్పుడు సమాచారం కావాలని ఇంటలిజెన్స్ ను కోరారు.

 అలా వచ్చి:

అలా వచ్చి:

విదేశాల నుంచి ఇక్కడికి వస్తున్న యువతుల్లో ఎక్కువ మంది ఎడ్యుకేషన్‌, విజిట్‌, బిజినెస్‌ వీసాలతోనే వస్తున్నారు. ఇక్కడ వీరికి తలెత్తే ఆర్థిక సమస్యలను బ్రోకర్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. భారీ డబ్బు ఆఫర్ చేసి వారిని వ్యభిచారంలోకి దింపుతున్నారు. బలవంతంగానే చాలామంది ఈ ఊబిలోకి దిగి సతమతమవుతున్నారు. ఒకసారి అందులోకి దిగాక.. తిరిగి బయటకు వెళ్తానంటే బ్రోకర్లే వారిని చంపేస్తామని బెదిరిస్తున్నారు. చిత్రహింసలకు గురిచేసి తీవ్రంగా వేధిస్తున్నారు. దీంతో దిక్కూ మొక్కు లేక విదేశీ యువతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసులు

కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసులు

గ్యాబ్లింగ్‌, వ్యభిచారం విషయంలో హైదరాబాద్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు విదేశీ యువతుల కదలికలను గమనిస్తూ వస్తున్నారు. ఇందుకోసం వారి నివాస చిరునామాలను తెలుసుకుంటున్నారు. వాళ్ల వీసాలు, వారు పనిచేస్తున్న వివరాలు.. తదితర విషయాలు తెలియజేయాల్సిందిగా ఫారిన్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు కూడా లేఖలు రాశారు.

ఎక్కువ సంఖ్యలో విదేశీ యువతులు వీసాలో పేర్కొన్న చిరునామాల్లో నివసించడంలేదని ప్రాథమిక విచారణలో తేలడంతో పోలీసులే ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. వారి నివాసాలు, పని వివరాలు తెలుసుకుంటున్నారు.

English summary
Hyderabad police are enquiring about foreign girls activities in city, in recent cased most of the foreign girls are held in prostitution cases
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X