వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వనమా రాఘవపై 12 కేసులు.. కేసుల వివరాలు ఇవిగో..

|
Google Oneindia TeluguNews

వనమా రాఘవపై ఉన్న కేసులకు సంబందించిన వివరాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. రాఘవపై ప్రస్తుతం 12 కేసులు ఉన్నాయని తెలిపారు. రామకృష్ణ ఆత్మహత్య కేసులో ముందస్తు బెయిల్‌లో ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు. బాస్ నన్ను క్షమించు అంటూ స్నేహితులకి రాసిన సూసైడ్ లేఖ వివరాలను కూడా పోలీసులు రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు.

Recommended Video

Palvancha Incident : Vanama Raghava పై ఇలాంటి కేసులు కొన్ని వందలు ఉన్నాయ్ | Oneindia Telugu

సూసైడ్ వీడియోను వైరల్ చేయమని బాధితుడు రామకృష్ణ స్నేహితులకు చెప్పాడు. నిందితుడు వనమా రాఘవ‌పై కొత్తగూడెం నియోజకవర్గంలో మూడు పోలీసు‌స్టేషన్‌లో కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కొత్తగూడెం, పాల్వంచ టౌన్, పాల్వంచ రూరల్, లక్ష్మీ దేవి పల్లి పోలీసు‌స్టేషన్‌లో ఉన్న కేసుల వివరాలను పోలీసులు రిమాండ్ రిపోర్టు‌లో పొందుపరిచారు. ఈ కేసులలో పాల్వంచ టౌన్‌లో 5 కేసులు, మరో 2 కేసులు పాల్వంచ రూరల్ ఉన్నాయని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.

కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మరో మూడు కేసులు, లక్ష్మీదేవిపల్లిలో ఒక కేసు నమోదు అయ్యింది. పాల్వంచ టౌన్‌లో మారో కేసు ఉంది. మొత్తం 12 కేసులు రాఘవపై నమోదు అయ్యాయని రిమాండు రిపోర్టు లో పోలీసులు పేర్కోన్నారు.

police file 12 cases to vanama raghavendra rao

రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్‌ కేసులో అరెస్టయిన వనమా రాఘవేంద్ర‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాఘవను ప్రాథమికంగా విచారించిన అనంతరం పోలీసులు కొత్తగూడెంలో మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. దీంతో అతనికి న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు అతనిని భద్రాచలం జైలుకు తరలించారు. రామకృష్ణను బెదిరించినట్టు రాఘవ అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు.

ఆత్మహత్య చేసుకునే ముందు రామకృష్ణ సెల్పీ వీడియో తీసి.. అందులో వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్ర రావు పేరును ప్రస్తావించారు. ఆయన వల్లే తాము సూసైడ్ చేసుకుంటున్నామని పేర్కొన్నారు. సెల్ఫీ వీడియో వైరల్ కాగా.. ప్రభుత్వం కూడా స్పందించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న రాఘవేంద్ర రావును అరెస్ట్ చేసింది. వనమా రాఘవేంద్ర రావుపై 302, 306, 307 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

English summary
police file 12 cases to vanama raghavendra rao. he is son of trs mla vanama venkateshwar rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X