పోలీస్ స్టేషన్‌లో ఒక్కటైన ప్రేమ జంట.. ఒప్పుకోరేమోనని పారిపోతే.. చివరికిలా...
పెద్దలు ఒప్పుకోరేమోనని ఇంట్లో నుంచి పారిపోయిన ఓ జంటకు పోలీసుల సమక్షంలో పెద్దల అంగీకారంతో పెళ్లి జరిగింది. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం... బషీరాబాద్ మండలంలోని జీవంగికి చెందిన మహేశ్వరి,యాలాల మండలం అక్కంపల్లికి చెందిన తుప్పల ఆంజనేయులు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే ఇరువురి పెద్దలు ఒప్పుకుంటారో లేదోనన్న భయంతో ఇటీవల ఇల్లు వదిలి పారిపోయారు.

మహేశ్వరి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల దర్యాప్తులో మహేశ్వరి హైదరాబాద్‌లో ఉన్నట్టు తెలిసింది. ఎట్టకేలకు మహేశ్వరిని,ఆంజనేయులును గుర్తించి బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఇరువురి కుటుంబ సభ్యులను కూడా అక్కడికే పిలిపించారు. తామిద్దరం కలిసే ఉంటామని మహేశ్వరి,ఆంజనేయులు చెప్పడంతో.. ఇరువురి కుటుంబాల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.
అందుకు వారు కూడా ఒప్పుకోవడం.. ఇద్దరూ మేజర్లు కావడంతో పోలీస్ స్టేషన్‌లోనే ప్రేమ జంటకు వివాహం జరిపించారు. ఇరువురి కుటుంబ సభ్యులు ఆ జంటను ఏమీ అనవద్దని పోలీసులు వారి పెద్దలకు సూచించినట్టు తెలుస్తోంది.
Recommended Video
-
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే!












Click it and Unblock the Notifications