కేసులా ఉన్నావ్.. దుకాణం నడుపుతున్నావా?: దళిత దంపతులపై పోలీస్ కావరం
నానా దుర్భాషాలాడటంతో పాటు 'కేసులా కేసులా ఉన్నావ్.. దుకాణమేమైనా నడుపుతున్నావా?' అంటూ తన నీచబుద్దిని బయటపెట్టకున్నాడు.
పెద్దపల్లి: ఒంటి మీద ఖాకీ చొక్కా పడగానే కొంతమంది కన్నూ మిన్నూ కానకుండా పోతారు. ప్రజాసేవ చేస్తున్నామన్న రీతిలో కాకుండా మీద జులుం ప్రదర్శించడమే తమ డ్యూటీ అని విర్రవీగిపోతారు. తాజాగా పెద్దపల్లి జిల్లాకు చెందిన ఇద్దరు ఎస్ఐలు దళిత దంపతులపై తాన కావరం ప్రదర్శించాడు.
ఏకంగా 'చూస్తుంటే కేసులా ఉన్నావ్.. దుకాణమేమైనా నడుపుతున్నావా?' అంటూ సదరు దంపతులను నోటికొచ్చినట్లు మాట్లాడాడు. ఇదేంటని నిలదీసినందుకు తిరిగి వారిపైనే దాడి చేయడమే గాక.. రివర్స్ లో వారి మీదే కేసులు బనాయించి ఆమె భర్తను చితకబాదారు.
బాధితుల కథనం ప్రకారం..పెద్దపల్లి మండలం బొంపెల్లి గ్రామానికి చెందిన అరికిల్ల మధునయ్యకు ధర్మారం ప్రధాన రోడ్డుకు రెండెకరాల భూమి ఉంది. వరి పంట వేసిన ఆ పొలానికి నీళ్లు కట్టాల్సిందిగా మధునయ్య తన కొడుకు దేవేందర్ కు చెప్పాడు. దీంతో రాత్రి 9గం. సమయంలో నీళ్లు కట్టేందుకు సొంత ఆటోలో బయలుదేరాడు.
మేము కూడా వస్తామంటూ పిల్లలు సంపూర్ణ, అపర్ణ, బ్లెస్సీ మారాం చేయడంతో.. భార్యతో సహా అందరు కలిసి పొలానికి వెళ్లారు. పొలం వద్దకు వెళ్లిన తర్వాత దేవేందర్ మోటార్ స్టార్ట్ చేయడానికి వెళ్లడంతో.. దేవేందర్ భార్య, అతని పిల్లలు ఆటోలో కూర్చున్నారు. ఇంతలో అటు నుంచి వెళ్తున్న ధర్మారం ఎస్సై హరిబాబు పోలీస్ వాహనం ఆపి.. ఆటో వద్దకు వచ్చాడు.
ఇక్కడెందుకున్నారంటూ ఆరా తీశాడు. పొలానికి నీళ్లు కట్టేందుకు వచ్చామని చెప్పినా వినిపించుకోలేదు. నానా దుర్భాషాలాడటంతో పాటు 'కేసులా కేసులా ఉన్నావ్.. దుకాణమేమైనా నడుపుతున్నావా?' అంటూ తన నీచబుద్దిని బయటపెట్టకున్నాడు. ఇంతలో అక్కడకు వచ్చిన దేవేందర్ ఎస్సైని నిలదీశాడు.
అంతే తనకే ఎదురు చెబుతావా అంటూ వారిద్దరిని పెద్దపల్లి స్టేషన్ కు తరలించిన ఎస్సై.. విషయాన్ని పెద్దపల్లి ఎస్సై శ్రీనివాస్ కు చెప్పాడు. దీంతో మమ్మల్నే ఎదిరిస్తావా.. అంటూ దేవేందర్ ను చితకబాదారు. అడ్డుకోబోయిన శ్యామలను పక్కకు నెట్టేయడంతో ఆమె అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో చేరిన తర్వాత శ్యామల ఎస్ఐల తీరు గురించి వివరించింది. భర్తను కొట్టవద్దని ఎంత బ్రతిమాలుడుకున్నా పోలీసులు వినలేదని కన్నీరుమున్నీరైంది. ఆదివారం నాడు తన భర్తను చూపించాలని కోరినా వారు వినిపించుకోలేదని ఆవేదన చెందింది. పోలీసుల తీరుకు నిరసనగా పలు ప్రజా సంఘాలు, టీఆర్ఎస్, బీజేపీ, సీఐటీయూ నాయకులు స్థానిక సివిల్ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు.












Click it and Unblock the Notifications