రాజా సింగ్‌కు మరోసారి పోలీసుల నోటీసులు
హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‍కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. 41ఏ సీఆర్పీసీ కింద మంగళ్‌హాట్ పోలీసులు నోటీసులు అందించారు. అజ్మీర్ దర్గాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గత ఆగస్టులో కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో రాజా సింగ్‌పై కేసు నమోదైంది.
ఈ కేసును కంచన్‌బాగ్ నుంచి మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో మంగళ్ హాట్ పోలీసులు రాజా సింగ్‌కు తాజాగా గురువారం నోటీసులు జారీ చేశారు.

కాగా, గత సంవత్సరం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ రాజా సింగ్‌ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. కొద్ది వారాలపాటు రాజా సింగ్ జైలులోనే ఉన్నారు. ఇటీవలే ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అయితే, ఇప్పుడు మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications