రవిప్రకాశ్‌కు రెండోసారి నోటీసులు : ఆదివారం విచారణకు హాజరుకావాలని స్పష్టీకరణ
హైదరాబాద్ : రవిప్రకాశ్‌కు సైబర్ క్రైమ్ పోలీసులు రెండోసారి నోటీసులు జారీచేశారు. టీవీ 9 వాటాల అంశంలో నకిలీ పత్రాలు సృష్టించడం, కంపెనీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ చేశారని కేసులో మరోసారి నోటీసులు ఇచ్చారు. ఆదివారం తమ ఎదుట హాజరుకావాలని అందులో పేర్కొన్నారు.

శివాజీ, మూర్తికి కూడా ...
ఇదివరకు సినీనటుడు శివాజీ, టీవీ 9 ఫైనాన్స్ డైరెక్టర్ ఎంకేవీఎన్ మూర్తికి నోటీసులు జారీచేశారు. శుక్రవారం సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. శివాజీ, రవిప్రకాశ్ విచారణకు రాలేదు. వ్యక్తిగత విచారణకు మరో పదిరోజుల సమయం ఇవ్వాలని రవిప్రకాశ్ తరఫు న్యాయవాది పోలీసులను కోరినట్టు తెలుస్తోంది.

పరారీలో శివాజీ
సినీనటుడు శివాజీ పరారీలో ఉన్నారు. ఆయనకు మరోసారి నోటీసులు జారీచేస్తామని పోలీసులు చెప్తున్నారు. అయినా ఆయన హాజరుకాకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టంచేశారు.

ఔట్ .. ఇన్
ఇదిలాఉంటే మరోవైపు టీవీ 9 సీఈవో, డైరెక్టర్ పదవీ నుంచి రవిప్రకాశ్ ను తొలగిస్తున్నట్టు అలందా మీడియా గ్రూపు శుక్రవారం ప్రకటించింది. టీవీ 9 సీఈవోగా మహేంద్ర మిశ్రా, సీవోవోగా సింగారావుకు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications