వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విస్ట్: కొంపముంచిన అఫిడవిట్, దీపక్ రెడ్డి అరెస్టుకు కారణమిదే!

భూ కబ్జాల కేసులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అరెస్టు కావడం వెనుక పోలీసులు చాలా పకడ్బందీగానే వ్యవహరించారు. ఏ భూ కబ్జాల కేసుల విషయమై పోలీసులు నోటీసులు పంప

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భూ కబ్జాల కేసులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అరెస్టు కావడం వెనుక పోలీసులు చాలా పకడ్బందీగానే వ్యవహరించారు. ఏ భూ కబ్జాల కేసుల విషయమై పోలీసులు నోటీసులు పంపించారో ఆ నోటీసులతో తనకు సంబంధం లేదంటూ దీపక్ రెడ్డి వ్యవహరించారు.అయితే ఇదే సమయంలో ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ పోలీసులకు కీలకమైన ఆధారంగా మారింది.

హైద్రాబాద్ నగరంలో వేలాది కోట్ల రూపాయాల విలువైన భూములను కబ్జా చేసినట్టు ఆరోపణలు ఎదుర్కోన్న దీపక్ రెడ్డి తన చేయితో తన కన్నునే పొడుచుకొన్నాడు. ఈ మేరకు పోలీసులు పకడ్బందీగా ప్లాన్ చేసి మరీ ఆయనను బుక్ చేశారు.

నకిలీ పత్రాలను సృష్టించడమే కాకుండా , ఆ పత్రాల సహయంతో విలువైన భూములను కబ్జా చేయడం, వాటిపై హక్కులను దక్కించుకొని ఎక్కువ రేటుకు విక్రయించేవాడు దీపక్ రెడ్డి.

బినామీ వ్యక్తుల సహయంతో వేలాది ఎకరాల భూమిని దీపక్ రెడ్డి స్వంతం చేసుకొన్నాడని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.ఈ విషయమై దీపక్ రెడ్డి భూ కుంభకోణానికి సంబంధించిన సమగ్రంగా విచారణ చేస్తున్నారు పోలీసులు.

నోటీసులిస్తే సంబంధంలేదంటూ తప్పించుకొనే ప్రయత్నం

నోటీసులిస్తే సంబంధంలేదంటూ తప్పించుకొనే ప్రయత్నం


ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిపై భూ కబ్జాల కేసులకు సంబంధించి సీసీఎస్ పోలీసులు ఆయనకు మూడు నోటీసులు
ఇచ్చారు. అయితే ఈ కేసులతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అయితే తన సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేశారని దీపక్ రెడ్డి చెప్పారు.అయితే ఈ కేసుల విషయంలో ఆయన కోర్టు నుండి ముందస్తు బెయిల్ కూడ తెచ్చుకొన్నారు.ఈ నోటీసులకు సమాధానం చెబితే కేసు పరిస్థితి మరోలా ఉండేదేమో.

దీపక్ రెడ్డిని ఇరికించిన అఫిడవిట్

దీపక్ రెడ్డిని ఇరికించిన అఫిడవిట్


ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో దీపక్ రెడ్డి దాఖలు చేసిన నామినేషన్ తో పాటు ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ పై కూడ పోలీసులు కన్నేశారు. ఎన్నికల అఫిడవిట్ లో దీపక్ రెడ్డి ప్రస్తావించిన స్థిర, చర ఆస్తుల వివరాలను పరిశీలిస్తే ఆధారాలు దొరుకుతాయని పోలీసులు భావించారు.ఈ మేరకు ఎన్నికల సంఘానికి లేఖ రాసి దీపక్ రెడ్డి సమర్పించిన అఫిడవిట్ ను తీసుకొన్నారు.ఏ స్థలాలలకు సంబంధించి దీపక్ రెడ్డి తన సంతకాలు ఫోర్జరీ చేశారని, కబ్జాలతో తనకు సంబంధం లేదని చెప్తున్నారో ఆ వివరాలు అఫిడవిట్లో ఉన్నాయి. ఈ స్థలాలన్నీ తనవేనని, కొన్ని కేసులున్నాయని ఆయన బోగస్ డాక్యుమెంట్ల నెంబర్లను కూడ ఇచ్చారు. ఈ అఫిడవిట్ ఆధారంగా దీపక్ రెడ్డిపై చర్యలు తీసుకొన్నారు.

దీపక్ రెడ్డి గ్యాంగ్ పై మరో కేసు నమోదు

దీపక్ రెడ్డి గ్యాంగ్ పై మరో కేసు నమోదు

బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి దీపక్ రెడ్డి గ్యాంగ్ పై ఫిర్యాదు చేశాడు. బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీలో ఉన్న 898.3 చదరపు గజాల స్థలంపై బోగస్ డాక్యుమెంట్లను సృష్టించి తన పేరుపై మార్చుకొన్నారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదుచేశారు.ఈ స్థలాప్పి బాలయ్య అనే వ్యక్తి యజమాని అంటూ దీపక్ రెడ్డి, శైలేష్ సక్సేనాలు నకిలీ సర్టిపికెట్లు సృష్టించారు.బాలయ్య అనే వ్యక్తి రాధాకృష్ణ ఠాకూర్ కు 16.4.1987 లో విక్రయించినట్టు డ్యాక్యుమెంట్లను సృష్టించారు. మావూరి శివభూషణం రాధాకృష్ణ ఠాకూర్ గా మార్చాడు.8.11.2006 లో ఠాకూర్ ఈ స్థలాన్ని దీపక్ రెడ్డి పేరుత్ సేల్ కమ్ జీపీఏ చేశారు.కొన్ని మార్పుల కోసం 2008 మార్చిలో దీపక్ రెడ్డి పేరుతోనే మరో ర్యాటిఫికేషన్ డీడ్ చేయించారు. ఈ పత్రాలపై న్యాయవాది సక్సేనా సాక్షి సంతకం చేశారు.ఈ పత్రాలను చూపి ఓ బ్యాంకు నుండి రూ.6 కోట్లను లోన్ గా తీసుకొన్నారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఆయుధ లైసెన్స్ లపై కేంద్రీకరణ

ఆయుధ లైసెన్స్ లపై కేంద్రీకరణ

దీపక్ రెడ్డి. శైలేష్ సక్సేనాలకు సంబంధించిన ఆయుధ లైసెన్సులపై సీసీఎస్ పోలీసులు కేంద్రీకరించారు. శైలేష్ సక్సేనాకు 2011 లో ఆయుధ లైసెన్స్ మంజూరైంది.ఆయన రెండు ఆయుధాలను కొనుగోలు చేశారు. నేరచరితులకు ఆయుధ లైసెన్సులు మంజూరు చేయకూడదు. శైలేష్ ఆయుధ లైసెన్స్ ను రద్దు చేయాలని సిఫారస్ చేస్తూ మొఘల్ పురా పోలీసులకు లేఖ పంపారు ఉన్నతాధికారులు.

English summary
CCS police perfect planning for Andhra pradesh Tdp MLC Deepak Reddy arrest.Election affidavit full evidence for CCS police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X