జూబ్లీహిల్స్‌లో పబ్ న్యూసెన్స్: ఫిర్యాదు, దాడి చేసిన పోలీసులు
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌పై శనివారం అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1లోని స్టోన్ వాటర్స్ లాంచ్ పబ్‌పై అర్ధరాత్రి 3 దాటిన తర్వాత పోలీసులు దాడి చేశారు.
పబ్ యజమాని ధీరజ్ మానిని అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి 3 దాటిన కూడా పబ్ తెరిచి ఉంచినట్లు చుట్టుపక్కల వారు న్యూసెన్స్ కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు పబ్‌పై దాడి చేశారు. పోలీసుల దాడితో పబ్‌లోని యువతీ యవకులు అక్కడి నుంచి జారుకున్నారు. అక్కడే మద్యం మత్తులో తాగి ఉన్న మరికొంతమందిని అతికష్టం మీద పోలీసులు బయటకు పంపించి వేశారు.












Click it and Unblock the Notifications