కేసీఆర్‌కు షాక్.. అస్సాంలో పోలీసు కేసులు నమోదు .. మరి హిమంతపై తెలంగాణలో..?
పుల్వామా, సర్టికల్ స్ట్రైక్‌పై ఆధారాలు చూపించాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్నారు. కేసీఆర్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. జవాన్ల త్యాగాలను చులకన చేసి మాట్లాడుతున్నరంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
అస్సాంలో కేసీఆర్‌పై కేసులు
గత కొన్ని రోజులుగా తెలంగాణ సీఎం కేసీఆర్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత భిశ్వశర్మపై మాట యుద్ధం నడుస్తోంది. ఈ తరుణంలో ముఖ్యమంత్రికి కేసీఆర్ ఉహించని షాక్ తగిలింది. అస్సాంలో కేసీఆర్‌పై పోలీసు కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం కేసీఆర్.. పుల్వామా, సర్జికల్ స్ట్రైక్‌పై ఆధారాలు ఉంటే చూపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ నేపథ్యంలో అస్సాం బీజేపీ మద్దతు దారులు కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. జాతి వ్యతిరేక భావాలు కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. బీజేపీ మద్దతు దారులు పెట్టిన కేసులు ప్రకారం అసోం పోలీసులు కేసీఆర్ పై కేసు నమోదు చేశారు.

హిమంత భిశ్వశర్మ వ్యాఖ్యలపై కేసీఆర్ ఫైర్
వారం రోజు కిందట అస్సాం సీఎం హిమంత భిశ్వశర్మ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతల కంటే ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. అస్సాం సీఎం వ్యాఖ్యలను తప్పపట్టారు. ఓ ఉన్న స్థానంలో ఉండి ఇలాంటి నీచపు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా మన దేశం మనకు నేర్పింది అని దుయ్యబట్టారు.

అస్సాం సీఎంపై తెలంగాణలో ఫిర్యాదులు
అటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు అస్సాం సీఎం హిమంత భిశ్వశర్మ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిమంత భిశ్వశర్మను ముఖ్యమంత్రి పదవి నుంచి బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నిరసనలకు దిగారు. ఇందులో భాగంగానే తెలంగాణలో అన్ని పోలీస్ స్టేషన్లలో అస్సాం సీఎంపై ఫిర్యాదులు చేశారు. స్వయంగా టీపీసీసీ రేవంత్ రెడ్డి బంజరాహిల్స్ పీఎస్‌లో హిమంతపై కేను నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే అసోం సీఎంపై కేసులు నమోదు చేసిన .. ఆయనను తెలంగాణకు ఈడ్చుకుని రావాలని డిమాండ్ చేశారు.
Recommended Video

కేసు నమోదు చేస్తారా?
ఇలాంటి తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఊహించని షాక్ తగిలింది. అసోంలో ఆయనపై కేసులు నమోదు చేస్తున్నారు. అయితే ఈ పరిణామాలన్నీ తెలంగాణ సీఎం వర్సెస్ అస్సాం ముఖ్యమంత్రి అన్న తీరుగా రాజకీయం మారిపోయింది. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు హిమంత పై కాంగ్రెస్ నేతలు తెలంగాణలో ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో అస్సాం సీఎంపై ఇక్కడ పోలీసులు కేసులు నమోదు చేస్తారా.. లేదా అన్నది చర్చనీయాంశమైంది..












Click it and Unblock the Notifications