బాలికపై తండ్రి, భార్య దాష్టీకం: భార్యకు రిమాండ్, పరారీలో తండ్రి
హైదరాబాద్: ఎల్బీ నగర్‌లోని ఫతుల్లాగూడలో బాలికను చిత్రహింసలకు గురి చేసిన కేసులో సవతి తల్లి శ్యామలకు రంగారెడ్డి జిల్లా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. స్థానికుల సమాచారంతో బాలల హక్కుల సంఘం నేతలు బుధవారం బాలికను విడిపించారు.
మరోవైపు, తండ్రి రమేష్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. సవతి తల్లి ఈ కన్నతండ్రి సమక్షంలోనే ప్రత్యూషకు నరకం చూపించింది.
కాగా, కన్న కూతురి పట్ల ఓ తండ్రి అత్యంత కిరాకతకంగా వ్యవహరించిన విషయం ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. కన్న తల్లి మరణించి దిక్కులేని బాలికకు కన్న తండ్రి, అతని రెండో భార్య నకరం చూపించారు. ఇంట్లో బంధించి చిత్రహింసలు పెట్టారు. మానసిక, శారీరక వేధింపులకు పాల్పడ్డారు.

ప్రతిరోజూ నిత్యకృత్యంగా మారిన ఈ హింసను ఆ అమ్మాయి ఏడుస్తూ భరించింది. చివరికి జబ్బు పడింది. కానీ వారు ఆస్పత్రికి కూడా తీసుకెళ్లని స్థితిలో ఆమె బాధను చూసి చలించిన స్థానికులు బాలల హక్కుల కమిషన్‌కు సమాచారం అందించారు. దీంతో పోలీసుల సహకారంతో వారు ఆ అమ్మాయికి విముక్తి కల్పించారు.
ఈ హృదయ విదారక సంఘటన హైదరాబాద్‍లోని ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న బాలల హక్కుల కమిషనర్ అచ్యుత రావు, ఎల్బీనగర్ పోలీసుల సహకారంతో బుధవారం రమేష్ ఇంటికి చేరుకుని బాధితురాలు ప్రత్యూషను విడిపించారు.












Click it and Unblock the Notifications