మరో షాక్: జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అవకతవకల కేసులో రేవంత్ రెడ్డికి నోటీసులు
హైదారబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నేత చిక్కుల్లోపాడ్డారు. కాంగ్రెస్ సీనియర్ నేత రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం నోటీసులు జారీ చేశారు. 41సీఆర్సీ కింద నోటీసులు జారీ అయ్యాయి.
Recommended Video

2001నాటి జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అవకతవకల కేసులో ఈ నోటీసులు జారీ చేశారు. తప్పుడు పత్రాలతో ఇళ్ల స్థలాలు కేటాయించారని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. 15రోజుల్లోగా విచారణకు హాజరై సమాధానం ఇవ్వాలంటూ రేవంత్ రెడ్డి సహా 13మందికి నోటీసులు జారీ చేశారు పోలీసులు.

ఈ నోటీసులకు రేవంత్ స్పందించారు. తాను ఎన్నికల బిజీలో ఉన్నానని, ఈ కారణం వల్ల విచారణకు హాజరుకాలేనని పోలీసులకు లేఖ రాశారు. కాగా, ఈ కేసు వివరాల్లోకి వెళితే.. తప్పుడు పత్రాలతో ఇళ్ల స్థలాలను కేటాయించారనే ఆరోపణలు రేవంత్ రెడ్డిపై ఉన్నాయి. ఇది ఇలా ఉంటే, ఇప్పటికే కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అరెస్ట్ కావడం, మరో నేత గండ్ర వెంకటరమణారెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications