అయ్యో.. పోలియో చుక్కలు వేసుకున్న కాసేపటికే పసిబిడ్డ..
పోలియో చుక్కలు ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నిలిపాయి. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ పసిబిడ్డను దూరం చేశాయి. అప్పటివరకూ ఆడిపాడిన ఆ చిన్నారిని విగతజీవిగా మార్చాయి. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగుల్చాయి. ఆ తల్లిదండ్రులు వెక్కి వెక్కి ఏడుస్తున్న దృశ్యాలు చూపరులను మరింతగా కలచివేశాయి. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది.
సంగారెడ్డి జిల్లాలో కంగ్టి మండలం భీమ్రాలో తీవ్ర విషాదం జరిగింది. పోలియో చుక్కలు వేసుకున్న కాసేపటికే మూడు నెలల చిన్నారి మృతి చెందడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలియో చుక్కలు వేసిన కొద్దిసేపటికి చిన్నారి వాంతులు చేసుకుంది. కాళ్లు.. చేతులు కొట్టుకుంటూ చిన్నారి మృతి చెందింది. తమ కళ్ల ముందే పసిబిడ్డ మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు వెక్కి వెక్కి ఏడ్చారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే పోలియో చుక్కలు వికటించడం ద్వారా తమ చిన్నారి బాబు ప్రాణాలు కోల్పోయాడని బాధిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అక్టోబర్ 12(ఆదివారం) న పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే సంగారెడ్డి జిల్లాలో పోలియో చుక్కలు తీవ్ర విషాదం నింపాయి. జిల్లాలోని కంగ్టి మండలం భీమ్రా గ్రామంలో ఈ విషాదకరమైన ఘటన జరిగింది. భీమ్రా గ్రామంలో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కార్యక్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. పోలియో చుక్కలు వేసుకున్న కొద్దిసేపటికే మూడు నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. బాలుడు వాంతులు, విరేచనాలు చేసుకున్నాడు. కాళ్లు చేతులు కొట్టుకున్నాడు. అయితే ఆందోళన చెందిన చిన్నారి తల్లిదండ్రులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాబు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఇదే విషయంపై పోలియో చుక్కలు వేసిన వైద్యులు, అక్కడి అధికారులు స్పందిస్తూ.. దాదాపు 100 మందికిపైగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశామని తెలిపారు. ఈ ఒక్క చిన్నారికే ఇలా జరిగిందని మిగతా వారంతా సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. బాబు మృతికి పోలియో చుక్కలకు సంబంధం లేదని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications