పరిటాల శ్రీరామ్ పెళ్లికి హాజరు: కేసీఆర్ 'కమ్మ' వ్యూహం, టిడిపికి షాక్?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రెండు రోజుల క్రితం ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ వివాహానికి హాజరయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రెండు రోజుల క్రితం ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ వివాహానికి హాజరయ్యారు.
తన కొడుకు పెళ్లికి హాజరు కావాలని పరిటాల సునీత ఆయనను ఆహ్వానించారు. ఈ మేరకు కేసీఆర్ వెంకటాపురం వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

పరిటాల కుటుంబంతో మంచి సంబంధాలు
దివంగత పరిటాల రవీంద్రతో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అప్పట్లో మంచి సంబంధాలు ఉన్నాయి. కేసీఆర్ నాడు అనంతపురం జిల్లా ఇంచార్జ్ మంత్రిగా మూడేళ్లు పని చేశారు. ఆ సమయంలో జిల్లా నేతలతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. పరిటాల కుటుంబంతో ఉన్న సంబంధాల నేపథ్యంలో కేసీఆర్ ఈ పెళ్లికి హాజరయ్యారు.

అభిమానం- రాజకీయం
పరిటాల శ్రీరామ్ - జ్ఞానవిల పెళ్లికి హాజరు కావడానికి రాజకీయ కారణం కూడా లేకపోలేదని అంటున్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా తనకు మంచి సంబంధాలు ఉన్న పరిటాల ఫ్యామిలీ పెళ్లికి వెళ్తే.. రాజకీయంగా కూడా లాభం జరుగుతుందని కేసీఆర్ భావించారని అంటున్నారు.

వారిని ఆకట్టుకోవడానికి కూడా
ఈ పెళ్లికి హాజరవడం ద్వారా తెలంగాణలోని కమ్మ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు కూడా రాజకీయంగా తనకు తోడ్పాటు అవుతుందని కేసీఆర్ భావించారని అంటున్నారు. పరిటాల రవికి ఇతర జిల్లాల్లోను ప్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ సామాజిక వర్గంలో మరింత ఎక్కువగా ఉంది.

తెలంగాణలో కమ్మలపై దృష్టి
హైదరాబాద్, ఖమ్మం వంటి జిల్లాల్లో కమ్మ సామాజిక వర్గం జనాబా బాగా ఉంది. వచ్చే ఎన్నికల నాటికి వారిని కూడా తమ దారికి తెచ్చుకోవాలి. తెలంగాణ సెంటిమెంట్ సమయమైన 2014లోనే మేజిక్ ఫిగర్ దాటేందుకు ఇబ్బంది పడింది. 2019లో నెగ్గాలంటే అందరిని తమ వైపుకు మళ్లించుకోవాల్సి ఉంది.

నేను మీ వాడినే
ఏపీలో టిడిపికి మద్దతిచ్చే కమ్మ సామాజిక వర్గాన్ని తెలంగాణలో తమ వైపు మల్చుకునేందుకు కూడా ఈ పెళ్లికి హాజరవడం ఉపయోగపడుతుందని తెరాస వర్గాలు భావించాయని తెలుస్తోంది. ఈ పెళ్లికి వెళ్లడం ద్వారా నేను మీ వాడిని కూడా అని చెప్పినట్లయిందని అంటున్నారు. కాగా, తెలంగాణలో అన్ని సామాజిక వర్గాలను ఆకట్టుకునేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. పరిటాల పెళ్లిలోను విక్టరీ సింబల్ చూపిస్తూ, అభివాదం చేస్తూ పెళ్లికి వచ్చిన వారిని ఆకట్టుకున్నారు. తెలంగాణలో కేసీఆర్ కమ్మ వారిని ఆకట్టుకుంటే అది తెలంగాణ టిడిపికి షాక్ అని చెప్పవచ్చు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications