తెలంగాణలో బిగ్ ఫైట్, అధికారం ఆ పార్టీదే - తేల్చేసిన ప్రముఖ సర్వే..!!

తెలంగాణలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. ప్రధాన పార్టీలు గెలుపు కోసం కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ మధ్య పోటీ కొనసాగుతోంది. రెండు పార్టీలు గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నా..పబ్లిక్ మూడ్ మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. పలు సర్వే సంస్థలు తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంచనాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా ఒక జాతీయ సర్వే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి..ఏ పార్టీకి ప్రజా మద్దతు ఉందనేది స్పష్టం చేసింది.

ఆసక్తి కర అంచనాలు
పలు రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో సర్వేలు చేసిన పొలిటికల్ క్రిటిక్ సర్వే సంస్థ తెలంగాణలోనూ సర్వే చేసింది. ఎన్నికలు జరుగున్న అయిదు రాష్ట్రాల్లో హోరా హోరీ పోరు ఖాయమని భావిస్తున్న మూడు రాష్ట్రాల్లోనూ ఈ సంస్థ తమ సర్వే ఫలితాలను వెల్లడించింది. అందులో రాజస్థాన్ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది.

Political Critic Survery predicts BRS Rtain power in Assembly Elections,Key Contest with Congress

అక్కడ కాంగ్రెస్ కు 100 -110 స్థానాలు వస్తాయని పేర్కొంది. బీజేపీకి 70-80 స్థానాలు దక్కే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఇతరులు15-20 స్థానాల వరకు గెలుచుకుంటారని అంచాన వేసింది. అదే విధంగా మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు 125 -135 స్థానాలు దక్కే అవకాశం ఉందని అంచనా గా వెల్లడించింది. బీజేపీకి ఈ రాష్ట్రంలో 90-100 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని విశ్లేషించింది. ఇతరులు 02-05 స్థానాలు వస్తాయని అంచనాగా పేర్కొంది.

తెలంగాణలో ఏం జరుగుతోంది
తెలంగాణలో ఈ సర్వే సంస్థ అంచనాలు ఆసక్తి కరంగా మారాయి. తెలంగాణ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు తలపడుతున్నా ముఖ్యంగా బీఆర్ఎస్ వర్సస్ కాంగ్రెస్ గా పోరు మారుతోంది. ఈ సర్వే అంచనాల మేరకు అధికార బీఆర్ఎస్ తిరిగి మరోసారి హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని పేర్కొంది. కాంగ్రెస్ తో గట్టి పోటీ ఉన్నా.. బీఆర్ఎస్ గెలుపు ఖాయమని అంచనా వేసింది.

బీఆర్ఎస్ కు 61- 66 సీట్లు వస్తాయని పేర్కొంది. కాంగ్రెస్ కు 46 -51 స్థానాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. బీజేపీకి 02-05 సీట్లు దక్కే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక, ఎంఐఎం కు 05-07 స్థానాలు వస్తాయని విశ్లేషించింది. కాంగ్రెస్ 49 సీట్లతో ఆగిపోనుందని..బీఆర్ఎస్ మ్యాజిక్ ఫిగర్ సాధించి అధికారం నిలబెట్టుకుటుందని అంచనా వేసింది.

హోరా హోరీ పోరు
తెలంగాణలో సర్వే సంస్థలు హోరా హోరీ పోరు ఖాయమని మాత్రం తేల్చి చెబుతున్నాయి. వరుసగా మూడో సారి అధికారం తమకు దక్కుతుందని సీఎం కేసీఆర్ తో సహా బీఆర్ఎస్ నేతలు ధీమాగా ఉన్నారు. ఇదే సమయంలో ఈ సారి తమ వైపే ప్రజలు నిలుస్తారని కాంగ్రెస్ విశ్వసిస్తోంది. రాహుత్ తో సహా పార్టీ అగ్ర నేతలు తెలంగాణలో అధికారం పై నమ్మకం పెట్టుకున్నారు.

బీజేపీ రేసులో ఉన్నామని చెబుతున్నా .. సర్వే సంస్థలు మాత్రం సింగిల్ డిజిట్ కే బీజేపీ పరిమితం అవుతుందని చెబుతున్నాయి. ఎన్నికలకు కౌంట్ డౌన్ కొనసాగుతున్న కొద్దీ ఈ రెండు పార్టీల్లోనూ ఉత్కంఠ పెరుగుతోంది. దీంతో, చివరి నిమిషంలో చోటు చేసుకొనే పరిణామాలు ఓటింగ్ పైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ లెక్కలతో తెలంగాణ ఎన్నికల్లో ఎవరు గెలిచినా హోరా హోరీ పోరు తప్పదని స్పష్టం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+