BRS పరాయి పార్టీ.. TDP లోకల్ పార్టీ?

తెలంగాణ రాజకీయాలు రసవత్తర మలుపులు తిరుగుతున్నాయి. ప్రత్యేక సెంటిమెంట్ ను త్యాగం చేసిన టీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా మారగా.. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఢిల్లీకి చేరాయి. డిగ్గీరాజా వచ్చినప్పటికీ వీటికి ఫుల్ స్టాప్ పడలేదు. భారతీయ జనతాపార్టీ రానున్న ఎన్నికల్లో బలమైన నాయకుల కోసం అన్వేషణలో ఉంది. కమ్యూనిస్టులు భారత రాష్ట్ర సమితితో కలిసి పోటీచేయబోతున్నారు.

తమదే లోకల్ పార్టీ అంటున్న టీడీపీ

తమదే లోకల్ పార్టీ అంటున్న టీడీపీ

ఇటువంటి తరుణంలో అనూహ్యంగా ఖమ్మంలో బహిరంగసభ నిర్వహించిన తెలుగుదేశం పార్టీ దాన్ని విజయవంతం చేసింది. సభ విజయవంతం కావడంతోపాటు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ కోరుకుంటే అక్కడ సభను పెడతామని సవాల్ విసిరారు. జాతీయ వాదంతో ఎన్నికలకు వెళ్లబోతున్న బీఆర్ఎస్ పరాయిపార్టీ అయిపోయిందని, తెలుగుదేశం పార్టీ లోకల్ పార్టీ అని వ్యాఖ్యానించారు. దీంతో రాజకీయ విశ్లేషకులకు చేతినిండా పనిదొరికినట్లైంది.

సెంటిమెంట్ ను టీఆర్ఎస్ వదిలేసిందంటున్న టీడీపీ

సెంటిమెంట్ ను టీఆర్ఎస్ వదిలేసిందంటున్న టీడీపీ


జాతీయ సమస్యల పరిష్కారానికి, నరేంద్రమోడీ-అమిత్ షా ద్వయాన్ని ఎదురించేందుకు కేసీఆర్ ఒకడుగు ముందుకు వేశారు. ఇటువంటి తరుణంలో రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి రాగలమనే నమ్మకం ఉండటంవల్లే ఆయన ధీమాగా వారిని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నారని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. ప్రత్యేక తెలంగాణను సాధించడమే ధ్యేయంగా ఆవిర్భవించిన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్. అదికాస్తా ప్రత్యేక సెంటిమెంట్ ను వదిలేయడంతో జాతీయవాద పార్టీ అయిపోయింది. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు తమదే అసలైన తెలంగాణ పార్టీ అని, ఆరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా చంద్రబాబునాయుడు లేఖ కూడా ఇచ్చాడనే విషయాన్ని రాష్ట్రంలో ప్రధాన అంశంగా తీసుకొస్తున్నారు.

సెంటిమెంట్ మీదే ఆధారపడ్డామంటున్న బీఆర్ఎస్

సెంటిమెంట్ మీదే ఆధారపడ్డామంటున్న బీఆర్ఎస్

రెండు కళ్ల సిద్ధాంతం అని విమర్శించినవరే ఈరోజు ఏమీ మాట్లాడటంలేదని, ఎందుకని అంటూ పసుపు శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఒకసారి ప్రజలంతా అర్థం చేసుకోవాలని, ప్రత్యేక రాష్ట్రం సెంటిమెంట్ వదిలేసిన పార్టీ కావాలా? తెలంగాణ అభివృద్ధి కోసం నిలబడిన తెలుగుదేశం కావాలా? అని తేల్చుకోవాలంటున్నాయి. జాతీయ సమస్యలపై పోరాటంతో తాను దేశవ్యాప్తంగా వెళ్లినప్పటికీ తెలంగాణలో మాత్రం తాము సెంటిమెంట్ మీదే ఆధారపడి రాజకీయం చేస్తామని గులాబీ శ్రేణులు అంటున్నాయి. మరి ప్రజలు ఎవరిని స్వీకరిస్తారో వేచిచూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+