వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మునుగోడులో మొనగాడు ఎవరో? తేల్చేది ఆ సామాజిక వర్గాల ఓటర్లే; అందరి ఫోకస్ వాళ్ళపైనే!!

|
Google Oneindia TeluguNews

మునుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం, నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం కావడంతో మునుగోడు రాజకీయాలు పీక్స్ కు చేరుకున్నాయి. మునుగోడు ఉపఎన్నిక అన్ని ప్రధాన పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తేనే, భవిష్యత్తు ఎన్నికల్లో సత్తా చూపించే అవకాశం ఉంటుందని అన్ని పార్టీలు భావించడంతో, ప్రస్తుతం మునుగోడులో ఓటర్లపై అన్ని రాజకీయ పార్టీల ఫోకస్ కనిపిస్తుంది.

అన్ని రాజకీయ పార్టీలకు మునుగోడు ఉపఎన్నిక కీలకం

అన్ని రాజకీయ పార్టీలకు మునుగోడు ఉపఎన్నిక కీలకం


భవిష్యత్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని రాజకీయ పార్టీలు ఎలాగైనా మునుగోడు నియోజకవర్గంలో తమ జెండా ఎగురవేయాలని ప్రయత్నం చేస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు ఎప్పుడైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారోఅప్పటినుండే రంగంలోకి దిగి,సామాజిక వర్గాల వారీగా ఓటర్ల జాబితాను సేకరించి కసరత్తులు మొదలు పెట్టాయి. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ లు సామాజిక వర్గాల వారీగా ఓటు బ్యాంకు వివరాలు సేకరించి వారి మద్దతు కోసం ప్రయత్నిస్తున్నాయి.

సామాజిక వర్గాల వారీగా ఓటుబ్యాంకుపై ఫోకస్ పెట్టిన రాజకీయ పార్టీలు

సామాజిక వర్గాల వారీగా ఓటుబ్యాంకుపై ఫోకస్ పెట్టిన రాజకీయ పార్టీలు


సామాజిక వర్గాల వారీగా మునుగోడు నియోజకవర్గంలో రాజకీయ పార్టీలుఏ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు? ఎవరి ఓట్లు ఎక్కువ ప్రభావం చూపిస్తాయి? వంటి అనేక అంశాలపై అధ్యయనం చేశారు. బీసీల ఓట్లు ఎన్ని? ఎస్సీ, ఎస్టీల ఓటుబ్యాంకు ఎంత?ఏ కమ్యూనిటీకి నియోజకవర్గంలోప్రాధాన్యత ఉంది? ఏ కమ్యూనిటీ మునుగోడులో నాయకత్వాన్ని నిర్ణయిస్తుందివంటి అనేకఅంశాలపై కసరత్తు పూర్తి చేసి ఆయా సామాజిక వర్గాల ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

మునుగోడు నియోజకవర్గంలో కీలక ఓటు బ్యాంకు ఈ సామాజిక వర్గానిదే

మునుగోడు నియోజకవర్గంలో కీలక ఓటు బ్యాంకు ఈ సామాజిక వర్గానిదే


ఇక మునుగోడు నియోజకవర్గంలో ఇటీవల కాలంలో కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్న 25 వేల ఓటర్లను మినహాయించి, మొత్తం ఓటర్లు రెండు లక్షల ఇరవై వేల ఐదు వందల ఇరవై మంది ఉంటే కులాల వారీగా ఎంత మంది ఓటర్లు ఉన్నారు. మునుగోడు నియోజకవర్గం లో అత్యధికంగా గౌడ కులస్తులు ఉన్నట్టు తెలుస్తుంది. మునుగోడు నియోజకవర్గంలో గౌడ సామాజిక వర్గానికి చెందిన వారు 35,150మంది 15.94% ఓటు షేర్ తో ఉన్నారు.

కులాల వారీగా ఓట్ల లెక్కలు ఇవే

కులాల వారీగా ఓట్ల లెక్కలు ఇవే


ఇక ఆ తరువాత స్థానంలో ముదిరాజులు ఉన్నారు. ముదిరాజ్ కమ్యూనిటీ లో 33, 900 మంది ఓటర్లు ఉన్నారు. ఇక ముదిరాజు ఓటు పర్సంటేజ్ 15.3 7 శాతంగా ఉంది. ఇక మూడవ స్థానంలో ఎస్సీ మాదిగ కమ్యూనిటీ ఉన్నట్టుగా తెలుస్తోంది. మునుగోడు నియోజకవర్గం లో ఎస్సీ మాదిగ ఓటర్లు 25 ,650 మంది ఉన్నారు. ఓటు శాతం 11.6 3 శాతం గా ఉంది.ఇదిలా ఉంటే యాదవ కమ్యూనిటీకి సంబంధించిన ఓటర్లు 21, 360 మంది కాగా వారి ఓటు షేర్ 9.69 శాతంగా ఉంది. ఇక పద్మశాలీలు 11, 680 ఉన్నారు. వారి ఓటు శాతం 5.30 శాతంగా ఉంది.

కులాల వారీగా ఓటు బ్యాంకుపై అందరి నజర్

కులాల వారీగా ఓటు బ్యాంకుపై అందరి నజర్


ఎస్టి లంబాడి ఎరుకల కులానికి చెందిన ఓటర్లు 10,520మందిఉన్నారు. వారి ఓటు శాతం4.7 శాతంగా ఉంది. కుమ్మరి కమ్యూనిటీలో7,850 మంది ఓటర్లు, ఇక ఎస్సీ మాల 10,350 మంది ఓటర్లు, వడ్డెర కమ్యూనిటీ చెందిన8,350 ఓటర్లు, విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ లో 7,820 ఓటర్లు, రెడ్డి కమ్యూనిటీ లో7,690 మంది ఓటర్లు, ముస్లింలు7,650 మంది, కమ్మ 5,680 మంది, ఆర్య వైశ్య కమ్యూనిటీ ఓటర్లు 3,760 మంది, వెలమ ఓటర్లు 2,360 మంది, మున్నూరు కాపు ఓటర్లు 2,350 మంది, ఇతరులు 18,400 మంది ఉన్నారు. ఇక కులాల వారీగా ఓటు బ్యాంకు వివరాలు సేకరించిన అన్ని రాజకీయ పార్టీలు కుల రాజకీయాలు చేస్తూ వారిని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

English summary
Who is the winner in Munugode? The figures in the voter's list say that the voters of Gowda, Mudiraj and SC Madiga communities has huge vote share. That's why everyone's focus seems to be on the vote bank of these three communities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X