ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం దొంగాట.. ఇక తాడోపేడో తేల్చుకుంటాం .. బీజేపీకి టీఆర్ఎస్ వార్నింగ్

ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందంటూ టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మోదీ సర్కార్ తో తాడోపేడో తేల్చుకుంటామని స్పష్టం చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు శ్రీకారం చుట్టింది. చావుడప్పునూ మోగిస్తూ, మోదీ సర్కార్ కు వ్యతిరేకంగా ప్రధాన కూడలిలో ఆందోళన దిగారు.

కేంద్ర మంత్రులు ఓ మాట.. బీజేపీ నేతలు మరోలా..

కేంద్ర మంత్రులు ఓ మాట.. బీజేపీ నేతలు మరోలా..

తెలంలంగాణలో అధికార టీఆర్ఎస్ , బీజేపీ మ‌ధ్య వార్ మ‌రింత తారాస్థాయికి చేరింది.రబీలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయమంటూ కేంద్రం చెప్పిన విషయాన్ని ప్రజలకు వివరిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ విషయంలో మోదీ సర్కారు రెండు నాల్కల ధోరణి అవలంబిస్తుందని మండిపడ్డారు. కేంద్ర మంత్రులు ఓ మాట చెప్తుంటే.. రాష్ట్రంలోని బీజేపీ నేతలు మరోలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం బాధ్యతను రాష్ట్రంపై రుద్దుతున్నారని ఆరోపించారు.

రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు

రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు

ధాన్యం కొనుగోళ్లు, సింగరేణి బొగ్గు వేలంతో పాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, మండల గ్రామ స్థాయిల్లో టీఆర్ఎస్ నేతలు ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్లు, మున్సిపల్ మేయర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు , జడ్పీటీసీలు, సర్పంచ్ లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, రైతు బంధు సమితీలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈనిరసన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేంద్రం తీరును నిలదీస్తూ రైతులకు అండగా నిలవాలని నేతలు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

బీజేపీ నేతలను ఉరికించాలి..

బీజేపీ నేతలను ఉరికించాలి..

ప్రజలను తప్పుదోవ పట్టించేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష‌డు వ్యవహారిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు విమర్శించారు. వరి వేయాలంటూ రైతులను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ నేతలకు టీఆర్ఎస్ కార్యకర్తలను తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తున్న బీజేపీ నేతలను పార్టీ శ్రేణులు ఉరికించాలని పిలుపునిచ్చారు.

తెలంగాణపై మోదీ సర్కార్ కక్ష‌ సాధింపులు

తెలంగాణపై మోదీ సర్కార్ కక్ష‌ సాధింపులు

తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తున్నా రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఎందుకు నోరు మెదపడం లేదని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. విభజన హామీలను ఇప్పటీ వరకు అమలు చేయలేదని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా కేంద్రం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడుగడుగునా తెలంగాణ ప్రభుత్వంపై మోదీ ప్రభుత్వం కక్ష‌ సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు.

ఢిల్లీలో తెలంగాణ మంత్రులు మ‌కాం

ఢిల్లీలో తెలంగాణ మంత్రులు మ‌కాం

మరోవైపు తెలంగాణ మంత్రులు ఢిల్లీలో మకాం వేశారు. ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని ఇవాళ కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ను కలవనున్నారు. అటు ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రుల అఫాయింట్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. కేంద్ర‌పై ఒత్తిడి తీసుకువ‌చ్చి ధాన్యం కొనుగోలు చేయించే విధంగా త‌మ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+