వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నయీంపై పొలిటికల్ వార్: దూరం పెట్టండి.. దమ్ముంటే రా.. మంచిరెడ్డిXమల్‌రెడ్డి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఆయనతో పలువురు రాజకీయ నాయకులకు, పోలీసు అధికారులకు సంబంధాలున్నాయనే వార్తలు వచ్చాయి. నయీం ఇష్యూ రాజకీయ నేతల్లోను గొడవను రాజేస్తోంది.

తాజాగా, ఆదివారం నాడు నయీం ఇష్యూ మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిల మధ్య మాటల యుద్ధానికి తెరలైపింది.

నయీం అనుచరులతో మంచిరెడ్డికి సంబంధాలు ఉన్నాయని మల్ రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. మంచిరెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మంచి ఇన్ ఫ్రా పేరుతో శ్రీహరి అనే వ్యక్తితో కలిసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారు.

కాల్ డేటాలో గుట్టు: చేతిలో నేతల చిట్టా, విచారణలో పాశం షాకింగ్ విషయాలునయీం ఎన్‌కౌంటర్ శుభపరిణామమేనని, కానీ మంచిరెడ్డి లాంటి వాళ్లను పార్టీకి దూరంగా పెడితే మంచిదని హితవు పలికారు.

Political war over links with Nayeem gang

మల్ రెడ్డి రంగారెడ్డి వ్యాఖ్యల పైన మంచిరెడ్డి తీవ్రంగా స్పందించారు. దమ్ముంటే పూర్తి ఆధారాలతో రేపు (సోమవారం) ఇబ్రహీంపట్నం రావాలని సవాల్ చేశారు. రాజకీయ లబ్ధి కోసమే మల్ రెడ్డి తన పైన ఆరోపణలు చేశారన్నారు.

త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులను దెబ్బతీసేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మల్ రెడ్డి తాడు బొంగరం లేని వ్యక్తి అన్నారు. తన కొడుకు పేరిట ఆదిభట్లలో ఎకరా భూమి ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు.

కాగా, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గత సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత అధికార తెరాసలో చేరారు. మల్ రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.

English summary
Political war over links with Nayeem gang. Congress leader Malreddy Ranga Reddy alleged that Manchireddy Kishan Reddy links with Nayeem's gang.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X