విజయమ్మతో పొంగులేటి భేటీ - సీన్ ఛేంజ్ : పార్టీ..ముహూర్తం ఫిక్స్..!?
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి వైఎస్ విజయమ్మతో భేటీ అయ్యారు. పార్టీ మార్పు వేళ ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి. ఖమ్మం రాజకీయాల్లో ఇప్పుడు చర్చల్లో నిలిచారు. బీఆర్ఎస్ ను దాదాపు బయటకు వచ్చేసారు. ఏ పార్టీలో చేరాలనే దాని పైన తర్జన భర్జన పడుతున్నారు. బీజేపీలో ఖాయం అని అందరూ భావించారు. ఇంతలో కాంగ్రెస్ నుంచి ఆఫర్ వచ్చింది. తేల్చుకొనే లోగా గత పరిచయాలో వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల చక్రం తిప్పారు. పొంగులేటితో చర్చించారు. గతంల వైఎస్సార్సీపీలో పని చేసిన పొంగులేటికి ఆ కుటుంబపై అభిమానం ఉంది. తాజాగా విజయమ్మతో భేటీ అయ్యారు. ఇక నిర్ణయానికి వచ్చేసారు. పార్టీలో చేరిక..ముహూర్తం దాదాపు ఫిక్స్ అయ్యాయి. తన నిర్ణయం పై అనుచరలతో సమవేశానికి పొంగులేటి సిద్దమయ్యారు.

విజయమ్మతో పొంగులేటి భేటీతో...
పొంగులేటి తాను ఏ పార్టీలో చేరినా జిల్లాలో తన హవా కొనసాగాలని కోరుకున్నారు. బీఆర్ఎస్ ను ఢీ కొట్టేందుకు సిద్దమయ్యారు. తొలుత బీజేపీలో చేరాలని భావించారు. కానీ, కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ అన్నట్లు గా పోరు సాగుతున్న ఖమ్మం జిల్లాలో బీజేపీకి పట్టు చిక్కటం ఖాయమని శ్రేయోభిలాషులు సూచించారు. వామపక్ష..కాంగ్రెస్..గులాబీ పార్టీకే అక్కడ ప్రజలు మద్దతుగా నిలిచే అవకాశం ఉందంటూ సర్వే నివేదికలు స్పష్టం చేసాయి. దీంతో..విదేశాల నుంచి తిరిగి వచ్చిన తరువాత వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిలతో భేటీ అయ్యారు. జిల్లాలో పాలేరు నుంచి షర్మిల పోటీ చేస్తుండటంతో..అక్కడ మినహా ఇతర నియోజకవర్గాల్లో పొంగులేటి మద్దతు దారులకు సీట్లు ఇచ్చే అంశం పైన చర్చ జరిగినట్లు సమాచారం. పార్టీలోకి వస్తే బాగుంటుందని షర్మిల సూచించారు. నిర్ణయం మాత్రం పెండింగ్ లో పెట్టారు. ఇప్పుడు తాజాగా విజయమ్మ తో భేటీ అయ్యారు. సుదీర్ఘ మంతనాలు చేసారు.

నాడు అన్నతో - నేడు చెల్లితో..
విజయమ్మతో భేటీ తరువాత పొంగులేటి రాజకీయ అడుగులు ఏంటనేది స్పష్టత వచ్చింది. వైఎస్సార్సీపీ ఆవిర్భావం తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ తో పాటుగా మూడు అసెంబ్లీ స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. ఖమ్మం నుంచి వైసీపీ ఎంపీగా పొంగులేటి గెలుపొందారు. ఇప్పుడు వైఎస్సార్టీపీ ఏర్పాటు తరువాత జరుగుతున్న తొలి ఎన్నికల్లో షర్మిల అదే జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో వైసీపీ కోసం ఆ కుటుంబంతో కలిసి పని చేసిన అనుభవం ఉండటంతో..ఇప్పుడు తన అనుచరులకు ఈ పార్టీ ద్వారా టికెట్లు దక్కించుకోవటం పైన చర్చలు చేసారు. కాంగ్రెస్ లో కొంత ఓట్ బ్యాంక్ కలిసి రావటంతో పాటుగా వైఎస్సార్ ఇమేజ్.. తమకు వ్యక్తిగతంగా ఉన్న మద్దతు కలిసి జిల్లాలో మెజార్టీ స్థానాలు గెలవచ్చని లెక్కలు వేసారు. పాలేరు లో షర్మిల గెలుపుకు సహకరించేందుకు పొంగులేటి విజయమ్మ తో భేటీలో హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో..నాడు జగన్ తో కలిసి వైసీపీలో..నేడు షర్మిలతో కలిసి వైఎస్సార్టీపీలో పొంగులేటి పని చేయటం ఖాయమని చెబుతున్నారు.













Click it and Unblock the Notifications