వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు నామాట కాదన్లేదు, అప్పుడే కాంగ్రెస్‌లోకి అని రేవంత్ రెడ్డి: పొంగులేటి కౌంటర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ దూతలు తనకు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారని, ఇప్పుడు తనను ఉపయోగించుకోవడం లేదన్న తెలంగాణ కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆ పార్టీకి చెందిన మరో నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి తప్పుబట్టారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితమని అభిప్రాయపడ్డారు.

ఆ పదవి వద్దు, నాకు ఎన్నో హామీలిచ్చారు, నా మాట వింటే సరే.. నేనే సీఎం: కాంగ్రెస్‌పై రేవంత్ సంచలనంఆ పదవి వద్దు, నాకు ఎన్నో హామీలిచ్చారు, నా మాట వింటే సరే.. నేనే సీఎం: కాంగ్రెస్‌పై రేవంత్ సంచలనం

పార్టీ తనను ఉపయోగించుకోవడం లేదని చెబుతూ పార్టీ అధ్యక్షుడిని తప్పుబట్టడాన్ని ఆయన ఖండించారు. అది సరికాదన్నారు. రాహుల్ గాంధీ పేరుతో ఎవరూ కూడా హామీలు ఇవ్వరని పొంగులేటి చెప్పారు. పార్టీలో ఇమిడిపోవాలన్నారు. ఆయనను ఎలా ఉపయోగించుకోవాలో పార్టీకి తెలుసునని చెప్పారు.

రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై రేవంత్ రెడ్డి మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నాయకత్వం తనను సరిగా ఉపయోగించుకోవడం లేదని, సీఎం కావాలన్నదే తన అంతిమ లక్ష్యమని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచనలు ఇచ్చేవారు సరిగా లేరన్నారు. ఈ వ్యాఖ్యలపై పొంగులేటి పైవిధంగా స్పందించారు.

వైయస్, అమిత్ షా ఆహ్వానించారు

వైయస్, అమిత్ షా ఆహ్వానించారు

వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారని కూడా రేవంత్ చెప్పారు. అన్ని రకాలుగా ప్రాధాన్యత ఇస్తామని చెప్పారన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా కూడా తమ పార్టీలోకి ఇటీవల ఆహ్వానించారని, అయినా తాను ప్రలోభాలకు లొంగలేదన్నారు.

చంద్రబాబు నా మాట కాదనలేదు

చంద్రబాబు నా మాట కాదనలేదు

చంద్రబాబు నాయుడు కష్టాలలో ఉన్న సమయంలో తాను తెలుగుదేశం పార్టీలో చేరానని రేవంత్ చెప్పారు. చంద్రబాబు నాకు అన్ని విధాలుగా సహకరించారన్నారు. చాలాసార్లు, చాలా విషయాల్లో తన మాటను కాదనలేదన్నారు. అలాంటి వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు నేను బయటకు ఎలా వస్తానని, ఆయన అన్ని విధాలా ప్లస్‌లో ఉన్నప్పుడే పార్టీ వదిలి వచ్చానని చెప్పారు. అది కూడా కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు వచ్చానని చెప్పారు. కాంగ్రెస్ సరైన వేదికగా భావించి వచ్చానని తెలిపారు.

 చంద్రబాబుతో విభేదాల్లేవు, నాకు నచ్చింది చేస్తా

చంద్రబాబుతో విభేదాల్లేవు, నాకు నచ్చింది చేస్తా

తనకు తెలుగుదేశం పార్టీతో, అలాగే చంద్రబాబు నాయుడుతో ఎలాంటి విభేదాలు లేవని రేవంత్ తేల్చి చెప్పారు. నాకు బ్యాటింగ్ వచ్చినప్పుడు తనను ఫస్ట్ ఆర్డర్‌లో పంపిస్తే పరుగులు చేస్తానని, బౌలింగ్ చేయమంటే ఎలా అన్నారు. రోడ్ల మీద పరుగెత్తగలిగే వాడిని తెర వెనుక కూర్చోమంటే ఎలా అన్నారు. నేను లీడర్‌ను అని, ఎవరో చెప్పింది చేయనని, నాకు నచ్చిందే చేస్తానని తెలిపారు.

 మంత్రి పదవి వద్దు.. ముఖ్యమంత్రి పదవే

మంత్రి పదవి వద్దు.. ముఖ్యమంత్రి పదవే

తనకు మంత్రి పదవి కూడా వద్దని, అయితే ముఖ్యమంత్రిని అవుతానని లేకుంటే లేదని రేవంత్ రెడ్డి అన్నారు. తనకు ఇంకా నాలుగు టర్మ్‌లకు సరిపడా వయస్సు ఉందన్నారు. టీడీపీలో చేరిన తర్వాత ఒక్కో పదవి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చానన్నారు. బయటకు వచ్చే సమయంలో టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్‌ని అన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌ను అని, ప్లోర్ లీడర్‌ను అని చెప్పారు. ఇంతకన్నా ఏం కావాలన్నారు.

 రేవంత్ వ్యాఖ్యలు, కాంగ్రెస్‌లో చర్చ

రేవంత్ వ్యాఖ్యలు, కాంగ్రెస్‌లో చర్చ

రాజకీయాలు అంటే ఓ ఆర్ట్ అని రేవంత్ అన్నారు. గణితంలా లెక్కలు వేయలేమని, సైన్స్‌లో వలే రసాయన ప్రయోగాలు చేసేది కాదని, బొమ్మ చివరి వరకు గీస్తే తప్ప అది ఏ మేరకు అందంగా ఉంటుందో, ఎంత అసహ్యంగా ఉంటుందో తెలియదన్నారు. కాగా, కాంగ్రెస్‌లో చేరిన కొన్నాళ్లకే రేవంత్ ఇలా మాట్లాడటం పార్టీలో చర్చకు దారి తీసింది.

English summary
Congress leader Ponguleti Sudhakar Reddy counter to Kodangal MLA Revanth Reddy for his comments on party leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X