ఎలా మెత్తబడ్డాడో గానీ..
తెలంగాణ మంత్రుల మధ్య తలెత్తిన వివాదం.. ఛప్పున చల్లారింది. దీనికి కేంద్ర బిందువు అయిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పడంతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శాంతించారు. క్షమాపణ చెప్పిన తర్వాత కూడా మొదట్లో అడ్లూరి సంతృప్తి చెందలేదు గానీ.. ఆ తర్వాత మెత్తబడ్డారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్ తో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. ఆ సమయంలో ఇద్దరు సరదాగా కనిపించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార సమయంలో పొన్నం ప్రభాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తోటి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అడ్లూరిని ఉద్దేశించి దున్నపోతు అని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా పొన్నం ప్రభాకర్, జీ వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించాల్సి ఉంది. దీనికి అడ్లూరి లక్ష్మణ్ హాజరు కావడంతో జాప్యం చోటు చేసుకుంది.

దీంతో పొన్నం అసహనానికి లోనయ్యారు. పక్కనే ఉన్నతో మాట్లాడుతూ మనకు సమయం తెలుసు..జీవితం తెలుసు..కానీ వారికేం తెలుసు ఆ దున్నపోతుగానికి అని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో మైక్ ఆన్‌లో ఉండటంతో ఆయన మాటలు బయటికి వినిపించాయి. ఇది కాస్తా వైరల్ అయ్యాయి. పొన్నం వ్యాఖ్యలపై అడ్లూరి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక దశలో ఏఐసీసీకి కూడా ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు వార్తలొచ్చాయి.
దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. ఇద్దరితో మాట్లాడారు. నచ్చెజెప్పారు. క్షమాపణ చెప్పించేలా పొన్నంపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో ఈ ఉదయం పొన్న ప్రభాకర్.. అడ్లూరికి సారీ చెప్పారు. క్షమాపణ చెప్పిన విధానం పట్ల తొలుత అడ్లూరి అభ్యంతరం తెలిపారు. చింతిస్తున్నా అని అనడం కంటే పొరపాటు జరిగిందని చెప్పి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. పొన్నం మాట్లాడిన మాటలను రాష్ట్ర ప్రజలందరూ చూశారని చెప్పారు. ఆ తర్వాత మనసు మార్చుకున్నారు. మెత్తబడ్డారు. పొన్నంతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు.
-
సామాన్యులకు బిగ్ షాక్..! పెరగనున్న ధరలు.. దేశంలోనే తెలంగాణ టాప్..! -
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications