వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నువ్వా రాజ్యాంగం గురించి మాట్లాడేది.. సిగ్గుండాలి : కేసీఆర్ ను ఏకిపారేసిన పొన్నాల లక్ష్మయ్య

|
Google Oneindia TeluguNews

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో బడ్జెట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేయడంతో పాటుగా, రాజ్యాంగాన్ని మార్చాలని చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం నెలకొంది. బీజేపీ నేతలే కాకుండా, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కెసిఆర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాజాగా కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ తెలంగాణా పీసీసీ చీఫ్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కేసీఆర్ తీరును తప్పు పట్టారు.

సీఎం కేసీఆర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడటం వింతగా ఉంది

సీఎం కేసీఆర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడటం వింతగా ఉంది

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై దేశమంతా స్పందించిందని పేర్కొన్న పొన్నాల లక్ష్మయ్య ముఖ్యమంత్రి కెసిఆర్ బడ్జెట్ పైన రాష్ట్ర అవసరాల పైన కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన రెండున్నర గంటలు మాట్లాడారు. ముఖ్యమంత్రిగా చీఫ్ సెక్రటరీ , మంత్రులను పక్కన కూర్చోబెట్టుకుని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తి అయిన సీఎం కేసీఆర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడటం వింతగా ఉందని పొన్నాల లక్ష్మయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎంగా రాజ్యాంగాన్ని మార్చాలి.. కొత్త రాజ్యాంగం కావాలి అనడం సిగ్గుచేటు అని పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు

కేసీఆర్ ఏం మత్తులో మాట్లాడాడో అర్థం కావడం లేదు


ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం మత్తులో మాట్లాడాడో అర్థం కావడం లేదని పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. అంబేద్కర్ - రాజ్యాంగాన్ని , ఈ రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులను అవమానించేలా మాట్లాడడం కెసిఆర్ అవివేకానికి నిదర్శనం అని పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. రాజ్యాంగంలో ఎక్కడైనా ఏవైనా సవరణలు చేయాల్సి వస్తే అన్ని ప్రభుత్వాలు చేస్తూనే వచ్చాయని పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చడమే అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడడం కాదా ? అంటున్నపొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. ఇదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయ్యారు కదా కేసీఆర్ అంటూ పేర్కొన్న లక్ష్మయ్య రాజ్యాంగంలో పొందుపరచిన అంశాలతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు అయిందని చురకలంటించారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాతే కదా ముఖ్యమంత్రి కాగలిగావు కేసీఆర్ అంటూ విమర్శించారు.

కేసీఆర్ మాట్లాడుతున్న భాష ఏంటి?

కేసీఆర్ మాట్లాడుతున్న భాష ఏంటి?


కెసిఆర్ మాట్లాడుతున్న భాష ఏంటి..? అని ప్రశ్నించిన పొన్నాల లక్ష్మయ్య ఇన్ని సంవత్సరాల రాజ్యాంగంలో మనం 105 సార్లు సవరణలు చేశామని స్పష్టం చేశారు. నీకు ఏ విషయంలో అయితే సవరణ అవసరమో ఆ విషయంలో చర్చ పెట్టి.. రాష్ట్రపతిని, పార్లమెంట్ ను , రాష్ట్రాలను ఒప్పించే ప్రయత్నం చేయాలి కానీ రాజ్యాంగాన్ని మార్చాలని అనడం అవివేకం కాదా అంటూ ప్రశ్నించారు. కెసిఆర్ అన్ని చట్టాల రాజ్యాంగ సవరణకు మద్దతు ఇచ్చారు అన్న విషయాన్ని గుర్తు చేశారు. దళిత బంధు అంటూ గొప్పలు చెప్పుకుంటున్నావు అని విమర్శించిన పొన్నాల లక్ష్మయ్య ,కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చింది అని పేర్కొన్నారు. దళిత ముఖ్యమంత్రి ,మూడెకరాల భూమి డబుల్ బెడ్ రూమ్ అన్నావు .. ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదని పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు.

 తెలంగాణా హక్కుల సాధనలో కేసీఆర్ విఫలం

తెలంగాణా హక్కుల సాధనలో కేసీఆర్ విఫలం


వ్యవసాయ చట్టాల మీద మొదట కెసిఆర్ చెప్పింది ఏంటి తర్వాత చేసింది ఏంటి అంటూ పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు.జీఎస్టీ ,నోట్ల రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కెసిఆర్ మద్దతు పలికారని ఎద్దేవా చేసిన పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ హక్కులను సాధించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యాడని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసీఆర్ తీరుపై న్యాయస్థానాలు ఎన్ని సార్లు మొట్టికాయలు వేసిందో అందరికి తెలుసు అని పేర్కొన్న పొన్నాల లక్ష్మయ్య నీవా చట్టాల గురించి రాజ్యాంగం గురించి మాట్లాడేది ? అంటూ మండిపడ్డారు . ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి నిచ్చెన వేసిందట అంటూ పొన్నాల లక్ష్మయ్య సీఎం కేసీఆర్ తీరును ఎద్దేవా చేశారు

రాజ్యాంగం మార్చడం అనేది రాజ్యాంగ ,దళిత, దేశ ద్రోహం కింద వస్తుందేమో

రాజ్యాంగం మార్చడం అనేది రాజ్యాంగ ,దళిత, దేశ ద్రోహం కింద వస్తుందేమో

రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దేశం గురించి మాట్లాడతావా కేసీఆర్ అని మండిపడ్డారు. బిజెపి, టిఆర్ఎస్ రెండు కలిసి రాజకీయం చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. కెసిఆర్ మాట్లాడుతున్న భాష పై పోలీసులు సుమోటోగా కేసు పెట్టాలన్నారు పొన్నాల లక్ష్మయ్య. అంబేద్కర్ గారి రాజ్యాంగం మార్చడం అనేది రాజ్యాంగ ,దళిత, దేశ ద్రోహం కింద వస్తుందేమో న్యాయనిపుణులు ఆలోచించాలన్నారు .

English summary
Ponnala Lakshmaiah said that CM KCR should be ashamed to talk about the constitution. Ponnala Lakshmaiah said he did not understand what Chief Minister KCR was talking about in intoxication.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X