హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'కేసీఆర్..? అధికారం నీకు ఎవరిచ్చారు' (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ‘చెస్ట్‌ ఆస్పత్రిని ఇక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కదలనివ్వం. ఇది వారసత్వ సంపద. హెరిటేజ్‌ కట్టడాన్ని తొలగించే అధికారం నీకు ఎవరిచ్చారు? ఇలాంటి దౌర్భాగ్యమైన ఆలోచన ఎందుకు వచ్చింది? నీకు ఏదో దాపురించిందని ప్రజలు అనుకుంటున్నారు. 50 వేల మంది ఉసురు నీకు తగులుతుంది జాగ్రత్త' అని పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.

‘ఎన్నికల హామీలు నేరవేర్చు మహానుభావా.. అని కోరుతుంటే కొత్త సమస్యలు సృష్టిస్తున్నావు' అని అన్నారు. చెస్ట్‌ ఆస్పత్రి తరలింపునకు సంబంధించి జీవో రావడంతో పొన్నాల లక్ష్మయ్య, మర్రిశశిధర్‌రెడ్డి, అంజన్‌కుమార్‌, ఎంఎస్‌ ప్రభాకర్‌, విష్ణువర్ధన్‌, నిరంజన్‌రెడ్డి, బండ కార్తీకరెడ్డి గురువారం ఆస్పపత్రికి వచ్చి వైద్యులను అడిగి మరీ తెలుసుకున్నారు.

ఎట్టి పరిస్థితుల్లో దీనిని తరలింపు జరగన్విబోమని, జీవోను వెంటనే ఉపసహరించుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య డిమాండ్‌ చేశారు. తెలంగాణలో ఇలాంటి పరిపాలన వస్తుందని ప్రజలు అనుకోలేదని అన్నారు. ఈ సర్కారు తీరు పూటకో మాట, రోజుకో ఆట మాదిరిగా ఉందని ఆయన అన్నారు.

‘ఇప్పటికే రైతులు, విద్యార్థులు, వృద్దులు, మహిళల ఉసురు ముట్టింది. ఈ ఆస్పత్రిని తరలిస్తే ప్రతి ఏడాది వచ్చే 50 వేల మంది రోగుల ఉసురు తగులుతుంది' అన్నారు. పిచ్చి కార్యక్రమాలు, పిచ్చి ఆలోచనలు చేస్తున్న కేసీఆర్‌పై మాట్లాడేందుకే సిగ్గేస్తున్నదన్నారు.

అన్ని పార్టీలు కలిసి ముందుకు వచ్చి, దీనిని అడ్డుకోవాలని ఆయన అన్నారు. ఇక మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ చరిత్రను మార్చే అధికారం, హక్కు ప్రభుత్వానికి లేదని, బహుమతిగా ఇచ్చిన భూమిని ఇతర అవసరాలకు ఉపయోగించడాన్ని చట్టం కూడా ఒప్పుకోదన్నారు.

హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న ఈ ఆసుపత్రి పరిధిలో కాలుష్యాన్ని తగ్గించే పచ్చని వాతావరణం ఉందని, అలాంటిది ఇక్కడి నుంచి ఎలా తరలిస్తారని ఆయన ప్రశ్నించారు. దీనిని వేరే విధంగా వాడుకుంటే ప్రజలు తిరగబడతారని ఆయన హెచ్చరించారు. వెంటనే జీవోను ఉపహరించుకోవాలని శశిధర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

 కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల ధ్వజం

కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల ధ్వజం

చెస్ట్‌ ఆస్పత్రి తరలింపునకు సంబంధించి జీవో రావడంతో పొన్నాల లక్ష్మయ్య, మర్రిశశిధర్‌రెడ్డి, అంజన్‌కుమార్‌, ఎంఎస్‌ ప్రభాకర్‌, విష్ణువర్ధన్‌, నిరంజన్‌రెడ్డి, బండ కార్తీకరెడ్డి గురువారం ఆస్పపత్రికి వచ్చి వైద్యులను అడిగి మరీ తెలుసుకున్నారు.

 కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల ధ్వజం

కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల ధ్వజం

‘చెస్ట్‌ ఆస్పత్రిని ఇక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కదలనివ్వం. ఇది వారసత్వ సంపద. హెరిటేజ్‌ కట్టడాన్ని తొలగించే అధికారం నీకు ఎవరిచ్చారు? ఇలాంటి దౌర్భాగ్యమైన ఆలోచన ఎందుకు వచ్చింది? నీకు ఏదో దాపురించిందని ప్రజలు అనుకుంటున్నారు.

 కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల ధ్వజం

కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల ధ్వజం

హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న ఈ ఆసుపత్రి పరిధిలో కాలుష్యాన్ని తగ్గించే పచ్చని వాతావరణం ఉందని, అలాంటిది ఇక్కడి నుంచి ఎలా తరలిస్తారని ఆయన ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో దీనిని తరలింపు జరగన్విబోమని, జీవోను వెంటనే ఉపసహరించుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య డిమాండ్‌ చేశారు.

 కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల ధ్వజం

కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల ధ్వజం

‘ఇప్పటికే రైతులు, విద్యార్థులు, వృద్దులు, మహిళల ఉసురు ముట్టింది. ఈ ఆస్పత్రిని తరలిస్తే ప్రతి ఏడాది వచ్చే 50 వేల మంది రోగుల ఉసురు తగులుతుంది' అన్నారు. పిచ్చి కార్యక్రమాలు, పిచ్చి ఆలోచనలు చేస్తున్న కేసీఆర్‌పై మాట్లాడేందుకే సిగ్గేస్తున్నదన్నారు.

 కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల ధ్వజం

కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల ధ్వజం

అన్ని పార్టీలు కలిసి ముందుకు వచ్చి, దీనిని అడ్డుకోవాలని ఆయన అన్నారు. ఇక మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ చరిత్రను మార్చే అధికారం, హక్కు ప్రభుత్వానికి లేదని, బహుమతిగా ఇచ్చిన భూమిని ఇతర అవసరాలకు ఉపయోగించడాన్ని చట్టం కూడా ఒప్పుకోదన్నారు.

 కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల ధ్వజం

కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల ధ్వజం

అన్ని పార్టీలు కలిసి ముందుకు వచ్చి, దీనిని అడ్డుకోవాలని ఆయన అన్నారు. ఇక మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ చరిత్రను మార్చే అధికారం, హక్కు ప్రభుత్వానికి లేదని, బహుమతిగా ఇచ్చిన భూమిని ఇతర అవసరాలకు ఉపయోగించడాన్ని చట్టం కూడా ఒప్పుకోదన్నారు.

 కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల ధ్వజం

కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల ధ్వజం

చెస్ట్‌ ఆస్పత్రిని తరలించి కొత్త సచివాలయాన్ని నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు.

 కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల ధ్వజం

కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల ధ్వజం

కాగా, నగర చరిత్రలో భాగమైన ఎర్రగడ్డ చెస్ట్‌ హాస్పిటల్‌ విషయంలో ఇంత హడావుడిగా, ఏకపక్షంగా నిర్ణయం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు.

 కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల ధ్వజం

కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల ధ్వజం

ఈ ఆసుపత్రి పరిసరాలను వృక్ష, ఉద్యానవన సంపదతో అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్‌ను సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య కోరారు.

 కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల ధ్వజం

కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల ధ్వజం

ఎర్రగడ్డలో చెస్ట్ ఆసుపత్రి పరిధిలోని 120ఎకరాల భూమిని రియల్టర్లకు కట్టబెట్టే ఉద్దేశంలో భాగంగానే కుట్ర జరుగుతోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య ఆరోపించారు.

హైదరాబాద్‌ బ్రాండ్‌ కాపాడుకోవాలంటే అందరూ ఇక్కడ పెట్టుబడులు పెట్టాలే కానీ, ఎవరినీ గాయపర్చొద్దని సూచించారు. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీయొద్దని కేసీఆర్‌కు హితవు పలికారు. తెలంగాణకు తామే గుత్తేదారులమని కేసీఆర్‌ అనుకోవడం సరికాదని శశిధర్‌రెడ్డి అన్నారు.

ఇక మాజీ ఎమ్మేల్యే విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ప్యాలెస్‌, స్థలాన్ని కేవలం వైద్యం కోసమే ఇచ్చారని అన్నారు. ప్రాణాలైన అడ్డుపెట్టి ఆస్పత్రి తరలింపును అడ్డుకుంటామన్నారు. చెస్ట్‌ ఆస్పత్రిని తరలించి కొత్త సచివాలయాన్ని నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు.

ఎవరూ అడగకపోయినా... ప్రభుత్వం ఫిల్మ్‌ సిటీని నిర్మిస్తామంటోందని, అసలు ఈ సర్కారుకు ప్రాధమ్యాలేమిటో అవగాహన లేదని విమర్శించారు. కాగా, నగర చరిత్రలో భాగమైన ఎర్రగడ్డ చెస్ట్‌ హాస్పిటల్‌ విషయంలో ఇంత హడావుడిగా, ఏకపక్షంగా నిర్ణయం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు.

ఈ ఆసుపత్రి పరిసరాలను వృక్ష, ఉద్యానవన సంపదతో అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్‌ను సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య కోరారు. ఎర్రగడ్డలో చెస్ట్ ఆసుపత్రి పరిధిలోని 120ఎకరాల భూమిని రియల్టర్లకు కట్టబెట్టే ఉద్దేశంలో భాగంగానే కుట్ర జరుగుతోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య ఆరోపించారు.

English summary
TPCC President Ponnala Laxmaiah and Marri Shashidhar Reddy, Other congress leaders visited govt chest hospital addressing Staff, Erragadda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X