Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎలా ఇవ్వరో చూస్తాం: బండి సంజయ్‌కి పొన్నం ప్రభాకర్, జగ్గారెడ్డి కౌంటర్

కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ ఇంట్లో నుంచి డబ్బులు ఇవ్వడం లేదని.. ఇందిరమ్మ పేరు పెడితే డబ్బులు ఇవ్వరా? ఎలా ఇవ్వరో తామూ చూస్తామంటూ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఇందిరమ్మపై అవహేళనగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

పది నెలల కాలంలో జీఎస్టీ రూపంలో రూ. 37 వేల కోట్లు కేంద్రం వసూలు చేసిందన్న పొన్నం ప్రభాకర్.. మరి కేంద్రం నుంచి తెలంగాణకు ఇచ్చింది ఎంత? అని ప్రశ్నించారు. దీన్ దయాల్ అంత్యోదయ, దీన్ దయాల్ గృహ జ్యోతి లాంటి పేర్లు పథకాలకు ఎందుకు పెట్టారని నిలదీశారు. వీళ్లేమైనా దేశం కోసం ప్రాణ త్యాగం చేశారా? అని నిలదీశారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారని.. కేంద్రం నుంచి అదనంగా ఏం తెచ్చారని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.

Ponnam Prabhakar Jagga Reddy counter Bandi Sanjay s comments

బండి సంజయ్ సహా బీజేపీ నేతలపై జగ్గారెడ్డి ఫైర్

పేదలకు ఇచ్చే ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే నిధులు ఇవ్వబోమని బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? అంటూ బండి సంజయ్‌పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రశ్నించారు. రాజకీయ అనుభవం తక్కువగా ఉన్న సంజయ్ మీడియాలో బ్రేకింగ్స్ రావాలని ఏది పడితే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రం నిధులు బీజేపీ నేతల సొంత నిధులు కావని, ప్రజలు కట్టిన పన్నులేనని గుర్తు చేశారు. రేవంత్ పాలన చూసి బీఆర్ఎస్ నేతలైన కేటీఆర్, హరీశ్ రావులకు బుర్రలు పనిచేయడం లేదని విమర్శించారు. కొత్త రేషన్ కార్డులను అడ్డుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని జగ్గారెడ్డి ఆరోపించారు.

బండి సంజయ్ ఏమన్నారంటే?

కేంద్రం నిధులతో అమలు చేసే పథకాలకు ఆ పార్టీ నేతల పేర్లు ఎలా పెడతారని ప్రశ్నించారు. కరీంనగర్ మేయర్ సునీల్ రావు బీజేపీలో చేరిన సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. ప్రధానమంత్రి ఆవాస్ యోచన పేరుతో కేంద్రం మంజూరు చేసే ఇళ్లకు 'ఇందిరమ్మ' పేరు పెడతామంటే ఒక్క ఇల్లు కూడా మంజూరు చేసేది లేదని హెచ్చరించారు.

కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి ఫొటోతోపాటు ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో ముద్రించాల్సిందేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. రేషన్ కార్డులపై ప్రధాని మోడీ పెట్టకపోతే ఉచిత బియ్యం ఎందుకివ్వాలని ప్రశ్నించారు. ప్రధాని ఫొటో పెట్టకపోతే పేదలకు కేంద్రమే నేరుగా ఉచిత బియ్యం అందించే అంశంపై ఆలోచన చేస్తామని బండి సంజయ్ తేల్చి చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+