పోస్టల్ బ్యాలెట్ బాక్సులు ఇక్కడెలా? తెరిచారా?: ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత
రంగారెడ్డి: జిల్లాలోని ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతలు, స్వతంత్ర అభ్యర్థులు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ సీల్‌ను తొలగించారని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. స్ట్రాంగ్ రూంలో ఉండాల్సిన పోస్టల్ బ్యాలెట్లు ఆర్డీవో కార్యాలయంలో ప్రత్యక్షం కావడంతో ఉద్రిక్తతకు కారణమైంది.
కాంగ్రెస్ పార్టీ, స్వతంత్ర అభ్యర్థి ఏజెంట్లు అధికారులతో వాగ్వాదానికి దిగారు. పోస్టల్ బ్యాలెట్ బాక్స్ సీల్ తొలగించి ఉండటం, అందులో ఉన్న బ్యాలెట్లు లేకపోవడంపై రిటర్నింగ్ అధికారిని నిలదీశారు. స్ట్రాంగ్ రూంలో ఉండాల్సిన పోస్టల్ బ్యాలెట్ బాక్సులు ఇక్కడ ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు.

ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి సంబంధించి 3057 పోస్టల్ ఓట్లు నమోదయ్యాయి. వీటికి సంబంధించిన ఆరు బాక్సులు స్ట్రాంగ్ రూంలో ఉండాలి. కానీ, ఆరు బాక్సులు ఆర్డీవో కార్యాలయం ఉండటంపై కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రిటర్నింగ్ అధికారి తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. కాగా, స్ట్రాంగ్ రూంలకు తరలించడం కొంత ఆలస్యమైందని సంబంధిత అధికారులు చెప్పినట్లు సమాచారం.

కాంగ్రెస్ నేతల ఆందోళనతో చివరకు పోస్టల్ బ్యాలెట్లను స్ట్రాంగ్ రూంకు తరలించారు అధికారులు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు విరమించాయి. అయితే, ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్వహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, ఆదివారం ఓట్ల లెక్కింపునకు అంతా సిద్ధం చేశారు ఎన్నికల అధికారులు. డిసెంబర్ 3 ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి 8.30 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను కౌంట్ చేస్తారు. కాగా, ఆదివారం మధ్యాహ్నం 12 గంటల కల్లా చార్మినార్ సెగ్మెంట్ లేదా భద్రాచలం నియోజకవర్గం ఫలితం వెలువడనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకల్లా రాష్ట్రంలోని అన్ని స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
The RDO opened the seal of the poster ballot boxes Room when no one was present at the RDO office in Ibrahimpatnam AC.
— Congress for Telangana (@Congress4TS) December 2, 2023
ఇబ్రహీంపట్నంలో ఆర్డీవో ఆఫీస్ లో ఎవరు లేనప్పుడు పోస్టర్ బ్యాలెట్ బాక్సుల a రూమ్ సీల్ ఓపెన్ చేసిన ఆర్డిఓ.
👉 ఇబ్రహీంపట్నంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద తీవ్ర… pic.twitter.com/LJu016DL3D
తెలంగాణలో మొత్తం ఓట్ల సంఖ్య 3,26,02,793 కాగా, వీరిలో 2,32,59,256 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోటీలో ఉన్న 2290 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ఆదివారం సాయంత్రంలోగా తేలనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 1766 టేబుల్స్ ఏర్పాటయ్యాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఉంటాయి.












Click it and Unblock the Notifications