అగ్గిపెట్ట హరీష్ రావు- రవ్వంత రేవంత్ రెడ్డి: ఇవేం పేర్లు?

T Harish Rao: సిద్ధిపేట్‌లో కలకలం చెలరేగింది. ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి శాసన సభ్యుడు, మాజీ మంత్రి టీ హరీష్ రావు క్యాంప్ కార్యాలయంపై అర్ధరాత్రి దాడి చోటు చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడిగా ఈ దాడికి పాల్పడ్డారు. ఆఫీస్‌ను ధ్వంసం చేశారు. ఫలితంగా- స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

రైతు రుణమాఫీ పథకం అమలు వ్యవహారం దీనికి కారణం అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. ఆగస్టు 15వ తేదీ నాటికి సంపూర్ణంగా రైతుల రుణాలను మాఫీ చేయగలిగితే తాను పదవికి రాజీనామా చేస్తానంటూ గతంలో హరీష్ రావు ప్రకటించిన విషయం తెలిసిందే.

Posters war between Congress and BRS in Telangana

చెప్పినట్టుగానే- మూడు విడతల్లో సంపూర్ణ రుణమాఫీ పథకాన్ని అమలు చేసింది తెలంగాణ సర్కార్. రెండు లక్షల రూపాయలలోపు రుణాలను మాఫీ చేసింది. పట్టాదారు పాస్‌బుక్‌లు ఉన్న రైతులకు దీన్ని వర్తింపజేసింది. ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించిన బహిరంగ సభ ద్వారా మూడో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

చెప్పినట్టుగానే తమ ప్రభుత్వం రైతుల రుణాలను మాఫీ చేసిందని, హరీష్ రావుకు దమ్ము ఉంటే వెంటనే రాజీనామా చేయాలంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దీనికి అనుగుణంగా ఆయన సొంత నియోజకవర్గం సిద్ధిపేట్, హైదరాబాద్ సహా రాష్ట్రంలో పలు చోట్ల ఫ్లెక్సీలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేశారు. హరీష్ రావు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తోన్నారు.

ఈ క్రమంలో వాళ్లు మరో అడుగు ముందుకు వేశారు. సిద్ధిపేట్‌లో గల హరీష్ రావు అధికారిక క్యాంప్ కార్యాలయంపై దాడికి దిగారు. ధ్వంసం చేశారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది. తాళాలను పగులగొట్టి ఆఫీస్‌లోకి దూసుకెళ్లారు. ఫర్మిచర్‌, కుర్చీలను విరగ్గొట్టారు. క్యాంప్ కార్యాలయం అని రాసివున్న భారీ బోర్డును పీకి పక్కనపడేశారు.

Posters war between Congress and BRS in Telangana

దీనికి కౌంటర్‌కు దిగారు బీఆర్ఎస్ నాయకులు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని తప్పాడంటూ భారీగా ఫ్లెక్సీలు, పోస్టర్లను ఏర్పాటు చేశారు. రైతు రుణాల మాఫీ అరకొరగానే అమలు చేశారంటూ ఎదురుదాడి చేస్తోన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను తెరపైకి తీసుకొచ్చారు.

40,000 కోట్ల రూపాయల మేర రైతుల రుణాలను మాఫీ చేస్తానంటూ ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఆ మొత్తాన్ని సగానికిపై కుదించారంటూ ధ్వజమెత్తుతున్నారు. రుణ మాఫీ చేసింది 17,000 కోట్ల రూపాయలు మాత్రమేనంటూ విమర్శలు గుప్పిస్తోన్నారు. ఈ వివరాలతో కూడిన పోస్టర్లను హైదరాబాద్ సహా పలు చోట్ల ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+