వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యుత్ ఉద్యోగుల వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారు?: కేంద్రంపై హైకోర్టు అసంతృప్తి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: విద్యుత్‌ ఉద్యోగుల కేటాయింపు వ్యవహారంలో కేంద్రప్రభుత్వం అలసత్వం ప్రదర్శించడంపై హైకోర్టు మంగళవారం అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం నిర్ణయం తీసుకోవడంలో జాప్యం వల్ల విద్యుత్‌ ఉద్యోగుల కేటాయింపుల వివాదం ఉత్పన్నమైందని అభిప్రాయపడింది.

సరైన సమయంలో స్పందించి ఉంటే ఈ సమస్య తలెత్తేదికాదు. సమస్య శాశ్వత పరిష్కారానికి ఎలాంచి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కేంద్రానికి స్పష్టం చేసింది.

విద్యుత్‌ ఉద్యోగుల సముస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలేమి చెపాలని, అవసరమైన సమారం ఇవ్వడానికి బాధ్యతగల అధికారి కోర్టుకు హాజరయ్యేలా చూడాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 25కి వాయిుుదా వేసింది.

Power staff: Officer to aid Hyderabad High Court

అంతకుముుందు.. పిటిషనర్ల తరఫున సీయుర్‌ న్యాయవాది సీవి మోహన్‌రెడ్డి, న్యాయువాది లక్ష్మీ నర్సింహా వాదనలు చెప్పారు. రిలీవ్‌చేసి ఉద్యోగులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని సప్రీంకోర్టు చెప్పినా తెలంగాణ ప్రభుత్వం తీసుకోవడం లేదని తెలిపారు.

ఈ వ్యాజ్యాల్లో ఇంత వరకు కేంద్రం కౌంటర్‌ దాఖలు చేయలేదని తెలిపారు. పిటిషనర్ల తరపు వాదనలు విన్న హైకోర్టు డివిజన్‌ బెంచ్‌... సమస్య పరిష్కారం పట్ల కేంద్రం అలసత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తీసుకొన్న చర్యలపై కౌంటర్‌ వేయాలని ఆదేశించింది.

English summary
The Hyderabad High Court on Tuesday asked the Centre to depute an officer concerned to assist the court decide the dispute with regard to distribution of employees of power distribution companies between the states of AP and Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X