భద్రాచలం రాములోరికి ప్రభాస్ విరాళం
ప్రభాస్ నటించి ఆదిపురుష్ పై దేశవ్యాప్తంగా భారీగా అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ అన్ని భాషల్లో ఘనవిజయం సాధించడం ఈ చిత్ర బృందానికి ఊరటనిచ్చింది. ఓం రౌత్ దర్శకత్వంలో శ్రీరాముడిగా నటించిన ప్రభాస్ దక్షిణ అయోధ్యగా పేరుపొందిన భద్రాలచం రామాలయానికి రూ.10 లక్షలు విరాళం ఇచ్చారు. తన తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణరాజు పేరుతో దీన్ని అందించారు. దీనికి సంబంధించిన చెక్కును ప్రభాస్ తరఫున ఆయన బంధువులు దేవస్థానం ఈవో రమాదేవిని కలిసి అందజేశారు. ఆలయంలోని ప్రధాన అర్చకులు ప్రభాస్ పేరిట స్వామివారికి పూజలు నిర్వహించారు. ఆదిపురుష్ చిత్రం విజయం సాధించాలని ప్రత్యేక పూజలు చేయడంతోపాటు ఆశీర్వచనాలిచ్చారు.
ఆదిపురుష్ లో శ్రీరాముడిగా ప్రభాస్, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్, సీతాదేవిగా కృతిసనన్, ఆంజనేయుడిగా దేవదత్తా, లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటించారు. టి సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్, కృష్ణకుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అజయ్ అతుల్ సంగీత దర్శకత్వం వహించారు.

ఆదిపురుష్ టీజర్ విడులైనప్పుడు ఈ చిత్రంలోని గ్రాఫిక్స్ అన్నీ చిన్నపిల్లల సినిమాల్లో కార్టూన్స్ లా ఉన్నాయంటూ దేశవ్యాప్తంగా అన్నివర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో గ్రాఫిక్స్ తిరిగి చేయించడంతోపాటు ఎటువంటి నెగెటివ్ వార్త రాకుండా ఉండేలా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ఇది అన్ని భాషల్లో విపరీతమైన ఆదరణ పొందుతోంది. ఈ చిత్రంపై తారస్థాయిలో అంచనాలున్నాయి. జూన్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 10వేల స్క్రీన్స్ పై విడుదల చేయబోతున్నారు. రామాయణం నేపథ్యంలో చెడుపై మంచి ఎలా గెలిచింది అనే కాన్సెప్ట్ తో రూపొందించారు. ట్రైలర్ విజయవంతం కావడంతో ఈ సినిమామీద ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి. ప్రస్తుతం ప్రభాస్ వరుసగా భారీ సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఆదిపురుష్ తోపాటు సలార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ తోపాటు మారుతి దర్శకత్వంలో లోబడ్జెట్ మూవీ చేస్తున్నాడు.












Click it and Unblock the Notifications