'సలార్' మూవీ యూనిట్ వాహనాన్ని ఢీకొన్న లారీ... నలుగురికి గాయాలు...
'సలార్' చిత్ర యూనిట్ ప్రయాణిస్తున్న వాహనం మంగళవారం రాత్రి (ఫిబ్రవరి 2) రోడ్డు ప్రమాదానికి గురైంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని శ్రీనగర్ కాలనీ వద్ద రాజీవ్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. చిత్ర యూనిట్ ప్రయాణిస్తున్న వ్యాను యూటర్న్ తీసుకుంటున్న సమయంలో... అటుగా వచ్చిన లారీ వాహనాన్ని ఢీకొట్టింది.దీంతో వాహనం స్వల్పంగా దెబ్బతినగా... అందులో ఉన్న నలుగురు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి.
ప్రమాద అనంతరం వారిని వెంటనే స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం తిరిగి వారు బస చేస్తున్న సింగరేణి గెస్ట్ హౌస్‌కు వెళ్లిపోయారు. రామగుండం ఓపెన్ కాస్ట్ గనిలో సలార్ చిత్ర షూటింగ్ ముగించుకుని గెస్ట్ హౌస్‌కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

కాగా,ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా మూవీ 'ఆది పురుష్' సెట్‌లోనూ మంగళవారం అపశృతి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ముంబైలోని గోరెగావ్ స్టూడియోలో వేసిన సెట్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గ్రీన్ స్క్రీన్ క్రోమా సెటప్ పూర్తిగా కాలిపోవడంతో భారీ నష్టం వాటిల్లింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో హీరో,హీరోయిన్లు సెట్‌లో లేరని తెలుస్తోంది.ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Recommended Video
ప్రస్తుతం ప్రభాస్ సలార్,ఆది పురుష్ చిత్రాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. 'కేజీయఫ్ ఛాపర్ట్1'తో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆది పురుష్ ఓం రావత్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాతలు భూషణ్‌కుమార్, కృష్ణకుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.












Click it and Unblock the Notifications