• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఔటర్ ఎక్కొద్దు.. ఇబ్బందులుపడొద్దు! ప్రగతి నివేదన సభ కోసం ప్రత్యేక రోడ్లు, 'భారీ' ఏర్పాట్లు

By Srinivas
|
  టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ నేపథ్యంలో ఆదివారం ప్రయాణాలు మానుకోవాలని సూచన

  హైదరాబాద్: కొంగరకలాన్ వద్ద టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ నేపథ్యంలో అవసరమైతే తప్ప ఆదివారం ప్రయాణాలు మానుకోవాలని సూచిస్తున్నారు. సభకు వచ్చి వెళ్లే వేలాది ప్రత్యేక బస్సులు, ఇతర వాహనాలతో ఆదివారం ఉదయం నుంచి సోమవారం వరకు రోడ్లన్నీ రద్దీతో కిక్కిరిసిపోతాయని చెబుతున్నారు. ప్రత్యేకంగా హైదరాబాద్ వైపు వచ్చే వారు, హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కవద్దని సూచిస్తున్నారు.

  ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఔటర్ రింగ్ రోడ్డు వైపు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని చెబుతున్నారు. ఆర్టీసీకి చెందిన చాలా బస్సులను ప్రగతి నివేదన సభ కోసం బుక్ చేశారు. కాబట్టి ఆదివారం అవసరమైతే తప్ప ప్రయాణాలు మానుకోవాలని సూచించారు. కేవలం హైదరాబాదుకు చెందిన రెండువేలకు పైగా ఆర్టీసీ బస్సులు, వేలాది ప్రయివేటు వాహనాలు ప్రగతి నివేదన సభకు తరలివెళ్తున్నాయి. ఎక్కువ వాహనాలు ప్రగతి నివేదన సభ వైపు వస్తుండటంతో ట్రాఫిక్ జామ్‌కు ఆస్కారం ఉంటుందని, అత్యవసరమైతేనే ప్రయాణం పెట్టుకోవాలంటున్నారు. రోడ్లు ఉదయం నుంచే ఆదివారం అర్ధరాత్రి లేదా సోమవారం ఉదయం వరకు బిజీగా ఉండనున్నాయి. స్వయంగా ఐటీ మినిస్టర్ కేటీఆర్.. ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్ప ఆదివారం ప్రయాణం వద్దని కోరారు.

  కొంగర కలాన్‌లో టీఆర్ఎస్ సభ ఇలా...

  తెలంగాణవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాదులో.. ఇంకా కొంగరకలాన్ సభా ప్రాంగణంలో ఎక్కడ చూసినా తెరాస జెండాలు, కేసీఆర్ భారీ కటౌట్లు కనిపిస్తున్నాయి. నింగికెగిరిన బెలూన్లతో కొంగర కలాన్ పరిసరాలు గులాబీమయమయ్యాయి. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో అధికార పార్టీ చేపట్టిన ప్రగతి నివేదన సభకు అంతా సిద్ధమైంది. దాదాపు 25 లక్షల జనాలు వచ్చే అవకాశముంది. ప్రగతి నివేదన సభలో పోలీసులకు సహకరించేందుకు వేలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలకు శిక్షణ కూడా ఇచ్చారు.

  సభకు వెళ్లేందుకు టెంపరరీ రోడ్లు

  హైదరాబాద్ శివారులోని కొంగర కలాన్‌లో సుమారు రెండు వేల ఎకరాల్లో సభకు సన్నాహాలు చేసింది. పార్కింగ్, రోడ్ల నిర్మాణానికే దాదాపు 1800 ఎకరాలను వినియోగించింది. ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేందుకు ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా సభకు చేరేలా ఏర్పాట్లు చేశారు. రింగు రోడ్డు పైకి వెళ్లేందుకు 19 తాత్కాలిక రహదారులను నిర్మించారు. అక్కడి నుంచి పార్కింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు 15 రోడ్లు నిర్మించారు. సభకు కనీసం కి.మీ. దూరంలో మొత్తం 19 పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు లక్ష వాహనాలు సభకు వస్తాయని అంచనా. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 20వేల మంది రైతులు, 2000 ట్రాక్టర్లలో ప్రగతి నివేదన సభకు వచ్చారు. రెండు రోజుల క్రితం ట్రాక్టర్లు బయలుదేరాయి. ఒక రోజు ముందే వచ్చాయి.

  గంటన్నరసేపు ప్రసంగించనున్న కేసీఆర్

  దాదాపు రెండు వందల ఎకరాల్లో సభకు ఏర్పాట్లను సిద్దం చేశారు. 300 మంది కూర్చునేందుకు వీలుగా సభా వేదికను నిర్మించారు. కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ తదితర ముఖ్య ప్రజా ప్రతినిధులు వేదికపై ఉంటారు. వేదిపై దాదాపు 270 మంది ఉండనున్నారు. ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వాగతవచనాలు పలుకుతారు. కేసీఆర్ గంటన్నర సేపు ప్రసంగించనున్నారు.

  సభకు వచ్చే వారి కోసం భారీ ఏర్పాట్లు

  వేదికకు ఎదురుగా పార్టీ నేతలు, కార్యకర్తలు, మహిళలు, వైద్యులు, న్యాయవాదులు, మీడియా, ఎన్నారై తదితర 24 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో 50 ఎల్‌సీడీ స్క్రీన్లను, 15వేల ఎల్ఈడీ బల్బులు, 200 జనరేటర్లు, సౌండ్ సిస్టమ్ సమకూర్చారు. ముందు జాగ్రత్తగా 150 మంది వైద్యులు, 30 అంబులెన్సులను సిద్దంగా ఉంచారు. మంచినీటి సరఫరా కోసం ప్రత్యేక ఫిల్లింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. 25 లక్షల మంచినీటి సీసాలు, మరో 25 లక్షల మంచినీటి ప్యాకెట్లను పంపిణీ చేయనున్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  IT Minister KT Rama Rao himself has urged public not to travel on this Sunday unless it’s an emergency. Public have been advised to plan their journey much in advance.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more