నాగబాబు బాటలోనే ప్రకాశ్ రాజ్ -"మా" కు రాజీనామా : ప్రాంతీయ వాదం గెలిచింది-సినిమా మొదలైంది..!!
"మా" ఎన్నికలు ముగిసాయి. ఫలితాలు వచ్చాయి. ఎన్నికలు అయిపోయిన తరువాత అందరం కలిసి ఒక్కటిగానే ఉంటామని ప్రముఖులంతా చెప్పారు. కానీ, ప్రచారంలో చోటు చేసుకున్న పరిణామాలు - వ్యాఖ్యల ప్రభావం మాత్రం కంటిన్యూ అవుతోంది. ప్రకాశ్ రాజ్ తెలుగు వాడు కాదుద.లోకల్ -నాన్ లోకల్ అంటూ ప్రచారం జరిగినా అనేక మంది విష్ణుతో సహా పలువురు దీనిని ఖండించారు. అయితే, ఇప్పుడు ఎన్నికల్లో ఓడిన ప్రకాశ్ రాజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో గెలిచిన తెలుగు బిడ్డ అంటూ విష్ణుకు అభినందనలు చెప్పారు.

తెలుగు బిడ్డను గెలిపించారు
అదే సమయంలో విష్ణు తన ఎన్నికల అజెండాలో భాగంగా "మా" లో ఇక నుంచి పోటీ చేసే వారు తెలుగు వారు పోటీ చేసే విధంగా బైలాస్ మారుస్తామని చెప్పారు. అవన్నీ అమలు చేస్తారని భావిస్తున్నాన్నారు. ఇటువంటి అసోసియేషన్ లో తాను సభ్యుడిగా ఉండలేనంటూ 21 ఏళ్లుగా సభ్యుడిగా కొనసాగుతున్న "మా" కు రాజీనామా చేసారు. తాజాగా ఎన్నికల ఫలితాల తరువాత ప్రకాశ్ రాజ్ కు మద్దతుగా బలంగా వాయిస్ వినిపించిన నాగబాబు సైతం సంకుచిత భావాలతో ఉన్న "మా" లో తాను కొనసాగలేనంటూ "మా" కు రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

తనకు ఆగ్మగౌరవం ఉందంటూ
ఇప్పుడు ప్రకాశ్ రాజ్ సైతం దాదాపు అదే కారణంతో రాజీనామా నిర్ణయం ప్రకటించారు. తాను "మా" కు రాజీనామా చేస్తున్నానని.. సినిమా పరిశ్రమలో మాత్రం ఉంటానని స్పష్టం చేసారు. "మా" సభ్యులు ఇచ్చిన తీర్పును గౌరవించి ఈ నిర్ణయం తీసుకుంటున్నానని వెల్లడించారు. తాను తెలుగు వాడిగా పుట్టకపోవటం తన తప్పు కాదని.. తన తల్లి తండ్రులు తెలుగు వారు కాకపోవటం వారి తప్పు కాదంటూ ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చారు. ఇతర భాషల వాళ్లు తెలుగు సినిమాల్లో నటించకూడదనే నిబంధన లేదన్నారు. ఇదే సమయంలో ఈ ఎన్నికల వివాదం ఇంకా ముగియలేదనే సంకేతాలు ప్రకాశ్ రాజ్ స్పష్టంగా ఇచ్చారు.

ఈ వివాదం ముగియలేదంటూ కీలక వ్యాఖ్యలు
ఇది ఇప్పుడే ముగిసిందనుకుంటున్నారా..లేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడే మొదలైందంటూ వ్యాఖ్యానించారు. దీంతో..ఈ వివాదం ఇంకా కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎక్కువ సంఖ్యలో పోలింగ్ కు వచ్చారని..చైతన్యంతో ఓట్లు వేసారంటూ చెప్పారు. సభ్యుల తీర్పును గాను గౌరవిస్తున్నానని స్పష్టం చేసారు. ఇక, ఇప్పుడు ప్రకాశ్ రాజ్ తీసుకున్న నిర్ణయం పైన విష్ణు అండ్ టీం ఏ రకంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.

విష్ణు స్పందన పైనే ఆసక్తిగా
తాను ఎన్నికల ముందు ఏం చెప్పానో దానికే కట్టుబడి ఉంటానని స్పష్టం చేసారదు. తాజాగా విష్ణు విజయం పైన బండి సంజయ్ చేసిన ట్వీట్ ను ప్రకాశ్ రాజ్ ప్రస్తావించారు. ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యల ద్వారా "మా" ఎన్నికల తో మొదలైన వివాదం.. మరింత కాలం ఇదే తరహాలో కొనసాగటం మాత్రం ఖాయమనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. విష్ణు స్పందన తరువాత దీని పైన మరింత స్పష్టత వచ్చ అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications