వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంత్యక్రియల్లో అమృత కన్నీరుమున్నీరు: హత్య సూత్రధారికి ఉగ్రమూలాలు?

|
Google Oneindia TeluguNews

మిర్యాలగూడ: ప్రణయ్ అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం మిర్యాలగూడలో ముగిశాయి. ఉక్రెయిన్‌లో చదువుతున్న ప్రణయ్‌ సోదరుడు అజయ్‌ ఆదివారం రాగానే అంతిమయాత్ర ప్రారంభమైంది. పలువురు నేతలతో పాటు పౌరహక్కుల ప్రతినిధులు వచ్చారు. స్థానికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రణయ్ హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.

అంతిమయాత్ర సందర్భంగా దారి పొడవునా ప్రణయ్‌ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ప్రణయ్‌ అంత్యక్రియలకు పెద్ద ఎత్తున జనం వస్తారని ముందే భావించిన పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అశ్రునయనాల నడుమ పార్థివదేహాన్ని దగ్గర్లోని చర్చికి తరలించి ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఖమ్మం మెయిన్ రోడ్డు మీదుగా రాజీవ్ చౌక్‌ సాగర్‌ రోడ్డు మీదుగా చర్చి వరకు యాత్ర సాగించారు.

అమృతపై ప్రేమతోనే చంపించా, 9వ తరగతిలోనే చెప్పా: ప్రణయ్ హత్యపై అమ్మాయి తండ్రిఅమృతపై ప్రేమతోనే చంపించా, 9వ తరగతిలోనే చెప్పా: ప్రణయ్ హత్యపై అమ్మాయి తండ్రి

అంతిమయాత్రలో నల్ల జెండాలు

అంతిమయాత్రలో నల్ల జెండాలు

అంతిమయాత్రలో నల్లజెండాలు ప్రదర్శించారు. ప్రణయ్ పైన పాటలు పాడుతూ నివాళులు అర్పించారు. అంతిమయాత్రలో మాజీ ఎమ్మెల్యేలు భాస్కర రావు, జూలకంటి రంగారెడ్డి, చిరుముర్తి లింగయ్య, నోముల నర్సింహులు, తెరాస నేత అమరేందర్ రెడ్డి, ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

ప్రణయ్ హత్యలో సూత్రధారి అబ్దుల్ బారీ

ప్రణయ్ హత్యలో సూత్రధారి అబ్దుల్ బారీ

ఇదిలా ఉండగా, ప్రణయ్ హత్య ఘటనకు సంబంధించి రోజుకో కొత్త అంశం వెలుగు చూస్తోంది. శుక్రవారం ఉదయం ప్రణయ్‌ను ఓ ప్రయివేటు ఆసుపత్రి ఎదుట నరికి చంపింది నల్గొండకు చెందిన రౌడీషీటర్‌ అని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రణయ్‌ భార్య అమృత తండ్రి మారుతీరావు.. హంతకుడికి రూ.10 లక్షలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. హత్యకు సూత్రధారి నల్గొండకు చెందిన రౌడీషీటర్‌ అబ్దుల్‌ బారీ అని విచారణలో తేలిందని సమాచారం.

మాజీ హోంమంత్రి పాండ్య హత్య కేసులో శిక్ష అనుభవించాడు

మాజీ హోంమంత్రి పాండ్య హత్య కేసులో శిక్ష అనుభవించాడు


అబ్దుల్ బారీకి ఉగ్రవాద మూలాలున్నాయి. గుజరాత్‌ మాజీ హోం మంత్రి హరేన్‌ పాండ్య హత్యకేసులో శిక్ష అనుభవించాడు. హత్యకు సంబంధించి మారుతీరావుకు దాదాపు పదిమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులు మారుతీరావు, అతని సోదరుడు శ్రవణ్‌, మారుతీరావు స్నేహితుడు, మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడైన కరీం, మారుతీరావు కారు డ్రైవర్‌, హత్యకు సూత్రధారి అబ్దుల్ బారీ, హంతకుడిగా భావిస్తున్న షఫీ, హత్యకు సహకరించిన రంగం రంజిత్‌, శ్రీకర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం.

ప్లాన్ అబ్దుల్ బరీది?

ప్లాన్ అబ్దుల్ బరీది?

మీడియాలో వస్తున్న వార్తల మేరకు.. ప్రణయ్ హత్యకు అమృత తండ్రి మారుతిరావు స్నేహితుడు కరీంను సంప్రదించారు. వీరిద్దరు అబ్దుల్ బరిని కలిశారు. వీరు ప్రణయ్ హత్యకు ప్లాన్ వేశారు. దాదాపు ఇరవై రోజుల క్రితం అబ్దుల్ బరీకి మారుతిరావు ఔటర్ రింగ్ రోడ్డులో రూ.15 లక్షలు ఇచ్చారు. ఆ తర్వాత మరో రూ.3 లక్షలు ఇచ్చారు. ఆ తర్వాత నల్గొండకు చెందిన రౌడీ షీటర్ షఫీని రంగంలోకి దించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతను హైదరాబాదులోని పాతబస్తీ కేంద్రంగా పలు దందాలు నడిపిస్తున్నాడని చెబుతున్నారు. నిత్యం ప్రణయ్, అమృతల కదలికలపై నిఘా వేసి హత్య చేశారు. కరీం, ప్రణయ్‌ల ఇళ్లు దగ్గరగా ఉన్నాయి. దీంతో కదలికలు బాగా తెలిసేవి. నయీం ముఠాతోను సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

పరువు తీస్తున్నారని భావించి

పరువు తీస్తున్నారని భావించి


ప్రణయ్ హత్యకు ప్లాన్ వేసిన మహ్మద్‌ అబ్దుల్‌ బారీ, హంతకుడు, హత్య అనంతరం నిందితుడిని బైక్ పైన తీసుకెళ్లిన వారి కోసం పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. పోలీసులు త్వరలో మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ప్రణయ్, అమృతల పెళ్లైన తర్వాత కొన్నాళ్లపాటు మారుతీరావు స్తబ్దుగా ఉన్నా ఆగస్ట్‌లో జరిగిన రిసెప్షన్‌తో అతనిలో పగ బుసలు కొట్టిందని అంటున్నారు. వీరి వివాహ విందు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో తన పరువు తీస్తున్నారని భావించిన మారుతీరావు సాధ్యమైనంత తొందరలో ప్రణయ్‌ను వదిలించుకోవాలని భావించాడని తెలుస్తోంది.

English summary
Cries of “Pranay Amar Rahe - Jai Bhim!” rang in the hour in the streets of Miryalaguda in Telangana on Sunday, as thousands from across the state flocked to the town for the funeral procession of Pranay Perumalla. The town bore witness to Dalit anger and sorrow, and hundreds of youngsters were part of the funeral procession that began from Pranay's home in Muthireddy Kunta and went around the town, before the burial took place at the Roman Catholic burial ground near his house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X