వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ సర్వే ఎఫెక్ట్: గులాబీ బాస్ కేసీఆర్ కు కొత్త టెన్షన్!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ కోసం పని చేస్తున్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సర్వేలు తెలంగాణ సీఎం కేసీఆర్ కు కొత్త టెన్షన్ తెచ్చిపెడుతున్నాయా? ఐప్యాక్ సర్వే ప్రభావంతో టిఆర్ఎస్ పార్టీ లోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీల వైపు చూస్తున్నారా? పీకే సర్వేలో మంచి ఫలితం వస్తేనే టికెట్లు ఇస్తామని హైకమాండ్ పదేపదే చెబుతున్న తీరు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలలో అనిశ్చితికి కారణంగా మారుతుందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టెన్షన్

టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టెన్షన్

టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అధికారం మూడోసారి చేజిక్కించుకోవడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో మూడో మారు గులాబీ జెండా ఎగరవేయడం కోసం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను రంగంలోకి దింపారు. ప్రశాంత్ కిషోర్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సర్వేలు చేస్తూ టిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరును గులాబి బాస్ కు చెబుతూ వస్తున్నారు. పీకే సర్వేలను అనుసరించి భవిష్యత్తు ఎన్నికలలో టికెట్లను ఇస్తామని హైకమాండ్ పదేపదే చెబుతున్న తీరు టిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో అనుమానాలను రేకెత్తిస్తోంది.

ప్రతిపక్ష పార్టీలతో మంతనాలు జరుపుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. టెన్షన్ లో గులాబీ బాస్

ప్రతిపక్ష పార్టీలతో మంతనాలు జరుపుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. టెన్షన్ లో గులాబీ బాస్

తమకు టికెట్ వస్తుందో లేదో అన్న అనుమానంతో ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీల నేతలతో టచ్ లోకి వెళుతున్నట్లు సమాచారం. ఒకపక్క అధికార పార్టీలో ఎమ్మెల్యేలుగా కొనసాగుతూనే, మరోపక్క ప్రతిపక్ష పార్టీ నేతలతో మంతనాలు జరుపుతూనే డబుల్ గేమ్ ఆడుతున్నారు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ అధికారపక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో కి వెళ్ళినా తమకే రావాలి అన్న చందంగా ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇక ఈ వ్యవహారం టిఆర్ఎస్ పార్టీలో కలకలంగా మారింది. గులాబీ అధినేత కేసీఆర్ కు కూడా టెన్షన్ పుట్టిస్తుంది.

ఎప్పుడు ఎవరు జంప్ జిలానీ అంటారో ?

ఎప్పుడు ఎవరు జంప్ జిలానీ అంటారో ?


ఎప్పుడు ఎవరు పార్టీ నుంచి జంప్ జిలాని అంటారో అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీల ముఖ్య నాయకులకు టచ్ లోకి వెళ్లారని చర్చ జరుగుతుంది. ఈ 20 మంది ఎమ్మెల్యేలకు కచ్చితంగా టికెట్లు ఇవ్వరని వారికి స్పష్టత ఉండటంతోనే పక్క పార్టీల వైపు చూస్తున్నారని పార్టీలో అంతర్గతంగా చర్చిస్తున్నారు. ఇక వీరే కాకుండా తమకు టికెట్ రాడని భావిస్తున్న చాలా మండి పక్క పార్టీలలో టికెట్ కోసం ప్రయత్నాలు ఇప్పటి నుండే ముమ్మరం చేశారు.

ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు నో టికెట్స్

ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు నో టికెట్స్

గత రెండు దఫాలుగా ఎమ్మెల్యేలుగా ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతుంది అని ఎమ్మెల్యేల పనితీరుపై ఐప్యాక్ సంస్థ చేసిన సర్వేలో తేలింది. ఇక ఇదే సమయంలో ఎమ్మెల్యేలు గా ఉండి కూడా ప్రజాక్షేత్రంలో ఎటువంటి పనులు చేయని వారిపై కూడా ప్రజా వ్యతిరేకత వ్యక్తమౌతుంది. మరికొన్నిచోట్ల అనేక వివాదాలలో తలదూర్చడం, ల్యాండ్ సెటిల్మెంట్లు చేయడం వంటి చర్యలతో మరికొంతమంది ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇక వీరికి టిక్కెట్లు ఇవ్వకూడదని టిఆర్ఎస్ హైకమాండ్ ఆలోచనలో ఉంది.

డబుల్ గేమ్ ఆడుతున్న ఎమ్మెల్యేల తీరుతో కేసీఆర్ కు కొత్త పరేషాన్

డబుల్ గేమ్ ఆడుతున్న ఎమ్మెల్యేల తీరుతో కేసీఆర్ కు కొత్త పరేషాన్

వీరికి టిక్కెట్లు ఇస్తే ఓటమిపాలు అవుతామన్న భావనలో ఉన్న అధిష్టానం ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు ఉన్న వారికే టిక్కెట్లు ఇస్తామని, పీకే సర్వే లలో మంచి ఫలితం వస్తేనే టికెట్లు ఇస్తామని ప్రకటించడంతో ఇతర పార్టీల్లో చేరడానికి మంతనాలు జరుపుతున్నారు పలువురు ప్రజా ప్రతినిధులు. నువ్వు కాకపోతే, ఇంకో పార్టీ అన్నచందంగా ముందుగానే సంకేతాలిస్తున్నారు టిఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు. ఇప్పటినుంచే డబుల్ గేమ్ ఆడుతున్న టిఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుతో తెలంగాణ సీఎం కేసీఆర్ కు కొత్త పరేషాన్ మొదలైంది.

English summary
With the Prashant Kishor I Pac Survey Effect, new tension for KCR. KCR was alarmed by the manner in which TRS sitting MLAs were holding talks with key leaders of opposition parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X