టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రశాంత్ కిషోర్ భయం.. పీకే చేతిలోనే టికెట్లు; పార్టీవర్గాల్లో జోరుగా చర్చ!!

టిఆర్ఎస్ పార్టీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రశాంత్ కిషోర్ భయం పట్టుకుందా? వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీలో టికెట్ల నిర్ణయం ప్రశాంత్ కిషోర్ చేతిలో ఉందా? పీకే ఓకే చెప్తేనే గులాబీ బాస్ టికెట్ ఇస్తారా? అంటే అవుననే చెబుతున్నాయి టిఆర్ఎస్ పార్టీ వర్గాలు. టిఆర్ఎస్ అభ్యర్థులను నిర్ణయించే పూర్తి బాధ్యత ప్రశాంత్ కిషోర్ చేతిలోనే ఉందని, ఆయన అనుగ్రహం ఉంటేనే టికెట్ వచ్చే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే పీకే అంటే టిఆర్ఎస్ పార్టీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు తెగ భయపడుతున్నారని సమాచారం.

తెలంగాణాలో పీకే సర్వే .. సిట్టింగ్ లపై వ్యతిరేఖత

తెలంగాణాలో పీకే సర్వే .. సిట్టింగ్ లపై వ్యతిరేఖత

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలంగాణ రాష్ట్రంలో ఈసారి టిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తెలంగాణ సీఎం, టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కోసం పని చేస్తున్నారు. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పరిస్థితిపై సర్వే నిర్వహించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన ప్రజల్లో ఉన్న వ్యతిరేకత పై కూడా ఆయన తన సర్వే చేపట్టారు. ప్రశాంత్ కిషోర్ సర్వేలో అధికార టీఆర్ఎస్ పార్టీలో సగం పైగా ఎమ్మెల్యేలపై ఆయా నియోజకవర్గాలలో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఉందని గుర్తించినట్టు సమాచారం.

కేసీఆర్ ఎన్నికల గెలుపు బాధ్యత పీకేకి అప్పగింత

కేసీఆర్ ఎన్నికల గెలుపు బాధ్యత పీకేకి అప్పగింత

ఇక అటువంటి వారికి టిక్కెట్లు ఇస్తే ఖచ్చితంగా ఓడిపోతారని ప్రశాంత్ కిషోర్ బృందం తమ సర్వే నివేదిక ద్వారా వెల్లడించారని సమాచారం. పరిస్థితులను గాడిలో పెట్టటం కోసం కూడా సమయం సరిపోయే పరిస్థితి లేకపోవటంతో పీకే కొత్తవారికి అవకాశం ఇవ్వాలని, ఆయా నియోజక వర్గాలలో ప్రత్యామ్నాయం కోసం కూడా చూస్తున్నారని తెలుస్తుంది. ఈసారి ఎన్నికలలో ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలతో ఉన్న సీఎం కేసీఆర్, తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యత ప్రశాంత్ కిషోర్ కు అప్పజెప్పారు అని సమాచారం.

పీకే పేరు చెబితేనే వణికిపోతున్న ఎమ్మెల్యేలు

పీకే పేరు చెబితేనే వణికిపోతున్న ఎమ్మెల్యేలు

ఈ క్రమంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యేలు గులాబీ బాస్ కంటే ముందే, ప్రశాంత్ కిషోర్ అనుగ్రహం కావాలని ఆరాట పడుతున్నారట. చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల ఆగ్రహాన్ని చవి చూస్తున్న నేపథ్యంలో, వారికి కాకుండా కొత్త వారికి టిక్కెట్లు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్లుగా అందుతున్న వార్తల నేపథ్యంలో ఎమ్మెల్యేలు పీకే పేరు చెబితేనే వణికిపోతున్నారని సమాచారం. వారికి ఇప్పటి నుండే కంటి మీద కునుకు ఉండటం లేదని తెలుస్తుంది.

సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎంతమందికి పీకే ఝలక్ ఇస్తారో?

సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎంతమందికి పీకే ఝలక్ ఇస్తారో?

రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు దందాలు, సెటిల్మెంట్లు చేయడం వల్లే వ్యతిరేకత వచ్చిందని పీకే టీం సర్వేలో వెల్లడైంది. కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి మూడవ స్థానానికి వెళ్లే లాగా కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే కొత్తవారిని రంగంలోకి దిగడానికి ప్రయోగం తప్పదని ప్రశాంత్ కిషోర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా టిఆర్ఎస్ పార్టీలో గత రెండు దఫాలుగా జరిగిన ఎన్నికలు ఎలాంటి వ్యూహకర్తలు లేకుండా, గులాబీ బాస్ నిర్ణయం మేరకు జరిగితే , రానున్న ఎన్నికలు మాత్రం కొత్తగా పీకే ఎంట్రీతో రసవత్తరంగా మారనున్నాయి. మరి టిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్న సిట్టింగులకు ఎంత మందికి ప్రశాంత్ కిషోర్ ఝలక్ ఇస్తారో వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+