ప్రత్యూష కేసు: తల్లిదండ్రులకు బెయిల్ నిరాకరించిన కోర్టు
హైదరాబాద్: సవతి తల్లి, కన్న తండ్రి చేతిలో చిత్ర హింసలకు గురై చివరికి బాలల హక్కుల సంస్థ ఫిర్యాదుతో విముక్తి పొందిన ప్రత్యూష కేసును మంగళవారం రంగారెడ్డి కోర్టు విచారించింది. ఆమె తండ్రి రమేష్, సవతి తల్లి ఛాముండేశ్వరిలకు బెయిల్ ఇవ్వడానికి రంగారెడ్డి జిల్లా కోర్టు నిరాకరించింది.
కాగా, ప్రత్యూషను చిత్రహింసలకు గురి చేసినట్టు మీడియాలో వార్తలు రావడంతో హైకోర్టు సుమోటోగా స్వీకరించి నిందితులపై కేసు నమోదు చేసింది. దీంతో పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ విషయం తెలియడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు స్పందించారు. ఆమెకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు.
బాధితురాలికి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రత్యూష చదువుకయ్యే ఖర్చును ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందని హామీ ఇచ్చారు. తన సొంత ఖర్చుతో వివాహం జరిపిస్తానని తెలిపారు. ఇటీవల సిఎం కెసిఆర్ తమ ఇంట్లో ప్రత్యూషతో కలిసి భోజనం కూడా చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications