70 కి.మీ నడిచిన నిండుచులాలు, రోడ్డుపైనే ప్రసవం, పండంటి బిడ్డ జననం..
లాక్‌డౌన్ వల్ల చేతిలో పనిలేదు. వలసకూలీల వెతల గురించి వింటేనే కలచివేస్తోంది. పనిలేకపోవడంతో నిండుచూలాలు భర్త, బంధువులతో కలిసి తన గమ్యస్థానం వైపు అడుగులేస్తోంది. అయితే నొప్పి రావడంతో రోడ్డుపక్కన డెలివరీ చేశారు. భర్త, బంధువులు కలిసి.. ప్రసవం చేసిన హృదయ విదారకర ఘటన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. గర్బిణీ 70 కిలోమీటర్లు నడిచాక ప్రసవం కాగా.. వారి పెద్ద కుమారుడు మూడేళ్ల వయస్సున్న బుడతడు కూడా కూడా నడిచాడు అని అంశం ప్రతీ ఒక్కరినీ కలచివేస్తోంది.
ఛత్తీస్‌గఢ్‌కి చెందన జంట ఉపాధి నిమిత్తం సంగారెడ్డిలో ఉంటోంది. అయితే చేతిలో పనిలేకపోవడంతో ఛత్తీస్ గఢ్ వెళ్లాలనుకొంది. సంగారెడ్డి నుంచి రాజ్ నాందగావ్ కాలినడకన బయల్దేరారు. అయితే 70 కిలోమీటర్లు ప్రయాణించాక.. నార్సింగ్ మండలం జాప్తి శివనూర్ గ్రామం వద్ద మంగళవారం ఉదయం నొప్పులు వచ్చాయి. వెంటనే భర్త, బంధువులు కలిసి రోడ్డు పక్కన ఆపి డెలివరీ చేశారు. ఆమెకు పండంటి మగబిడ్డ జన్మించారు.

విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై రామాయంపేట ఏరియా ఆస్పత్రికి ప్రైవేట్ అంబులెన్స్‌లో తరలించారు. తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం వారిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. నిండుచూలాలు రోడ్డు మీద డెలివరీ కావడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. వారిద్దరూ క్షేమంగా ఉండటం మాత్రం కాస్త ఊరటనిచ్చే అంశం.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications