గర్భిణీ హత్య: 5 ఏళ్ళ కొడుకు ముందే దారుణం, బీహర్‌‌లో నిందితుడి అరెస్ట్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: బొటానికల్ గార్డెన్ వద్ద గర్భిణీ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కుటుంబ కలహలతోనే అమర్‌కాంత్ ఝాను హత్య చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే మృతురాలి ఐదేళ్ళ కొడుకు ఎదుటే ఆమెను చంపేశారని తెలుస్తోంది. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు బీహర్‌లో అరెస్ట్ చేశారు.

జనవరి 30వ, తేదిన బొటానికల్ గార్డెన్ సమీపంలో గోనెసంచిలో ముక్కలు ముక్కలుగా నరికిన మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసులో కీలక నిందితుడిని పోలీసులు సోమవారం నాడు బీహర్‌లో అదుపులోకి తీసుకొన్నారని సమాచారం.

కుటుంబ కలహల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధాన నిందితుడిని హైద్రాబాద్‌కు తీసుకువస్తున్నారు.

 కొడుకు ముందే తల్లి హత్య

కొడుకు ముందే తల్లి హత్య

కొండాపూర్ బొటానికల్ గార్డెన్ వద్ద గోనెసంచిలో దొరికిన మహిళ మృతదేహం బాగాలు కలకలం రేపాయి. వదినను ఆమె మరిదే అమర్‌కాంత్ ఝా దారుణంగా హత్య చేశారు. ఆమెను హత్య చేసే ముందు ఆమె ఐదేళ్ళ కొడుకు కూడ అక్కడే ఉన్నాడు. మృతురాలిని కోసి ముక్కలు ముక్కలుగా చేసి గోనేసంచిలో కట్టి బొటానికల్ గార్డెన్ సమీపంలో పారేశారు.

 కేసు ఛేధించేందుకు పోలీసుల కృషి

కేసు ఛేధించేందుకు పోలీసుల కృషి

మృతదేహన్ని గుర్తు పట్టకుండా ఉండేందుకు నిందితుడు ముఖాన్ని గాయపర్చారు. అయితే సీసీటీవి పుటేజీలో మోటార్ బైక్ ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. సీసీటీవి పుటేజీలో మోటార్ బైక్ ఎక్కడి నుండి వచ్చిందనే విషాయాన్ని ఆరా తీసిన పోలీసులు సిద్దిఖీనగర్, అంజయ్యనగర్ ప్రాంతాల్లో తెల్లవారుజామున సుమారు రెండు వందల మంది పోలీసులు కార్డన్ సెర్చ్ చేశారు ఆ సమయంలో నిందితుల వివరాలను రాబట్టారు. టెక్నాలజీ ఆధారంగా పోలీసులు ఈ కేసును చేధించారు.

 ఎందుకు హత్య చేశారు

ఎందుకు హత్య చేశారు

ఎందుకు అమర్‌కాంత్ ఝా తన వదినను హత్య చేశారనే విషయమై పోలీసులు విచారిస్తున్నారు. అసలు ఇంత క్రూరంగా ఆమెను హత్య చేయడం వెనుక కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కుటుంబకలహలే కారణమని పోలీసులు చెబుతున్నారు. కానీ, కుటుంబకలహలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

నిందితుల అరెస్ట్

నిందితుల అరెస్ట్

గర్భిణీ హత్య కేసులో ప్రధాన నిందితుడు అమర్‌కాంత్ ఝా గా పోలీసులు గుర్తించారు.ఈ కేసులో పోలీసులు మృతురాలి అత్త, మామలను అరెస్ట్ చేశారు. అంతేకాదు ప్రధాన నిందితుడు అమర్‌కాంత్ ఝాను పోలీసులు బీహర్‌లో అరెస్ట్ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
After a weeklong probe into the murder case of a pregnant woman, who was found chopped into pieces near Hyderabad's Botanical Gardens in Kondapur, the Cyberabad Police on Monday made a major breakthrough by identifying the accused.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి