తేనీటి విందు: అచ్చెన్న అంత ఎత్తు ఎదగాలంటూ కుమారుడితో కేటీఆర్‌(ఫోటోలు)

హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ప్రముఖులకు తేనీటి విందు ఇచ్చారు. ఈ విందుకు తెలంగాణ కేసీఆర్ హాజరయ్యారు. జపాన్‌ పర్యటనలో ఉండటంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విందుకు హాజరుకాలేక పోయారు.

సాయంత్రం 6గంటల నుంచి సుమారు గంటకు పైగా సాగిన తేనీటి విందులో రాష్ట్రపతి ఉల్లాసంగా గడిపారు. హాజరైన వారిని ఆయన ఆప్యాయంగా పలకరించారు. ప్రజాప్రతినిధులను పరిచయం చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కొద్ది సేపు ముచ్చటించారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్రపతి దగ్గరకు వచ్చి పరిచయం చేసుకుని నమస్కరించారు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఇచ్చిన విందు రాజకీయ నేతల మధ్య నెల రోజులుగా నెలకొన్న వేడిని తగ్గించినట్లు కనిపించింది. విందులో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఎదురుపడినప్పుడు ఏపీ మంత్రులు మర్యాదపూర్వకంగా నమస్కారం చేశారు.

మంత్రి తారక రామారావు తన కుమారుడిని ఏపీ కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు పరిచయం చేశారు. బాగా పొడగరి అయిన అచ్చెన్నాయుడును పరిచయం చేస్తూ..‘నువ్వు కూడా అచ్చెన్న అంతా ఎత్తు ఎదుగాలి' అని చమత్కరించారు.

ప్రముఖులకు రాష్ట్రపతి తేనీటి విందు

ప్రముఖులకు రాష్ట్రపతి తేనీటి విందు


ఈ కార్యక్రమానికి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రులు మహమూద్‌ అలీ, కడియం శ్రీహరి, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, కౌన్సిల్ ఛైర్మన్ స్వామిగౌడ్ దంపతులు, పంచాయతీరాజ్, ఐటీ శాఖమంత్రి కే తారకరామారావు, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ హాజరయ్యారు.

ప్రముఖులకు రాష్ట్రపతి తేనీటి విందు

ప్రముఖులకు రాష్ట్రపతి తేనీటి విందు


ఏపీ ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రి అచ్చెన్నాయుడు, ఏపీ ప్రధానకార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, అజహరుద్దీన్‌తో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

ప్రముఖులకు రాష్ట్రపతి తేనీటి విందు

ప్రముఖులకు రాష్ట్రపతి తేనీటి విందు


ఐ అండ్ పీఆర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ బీపీ ఆచార్య ఆర్కియాలజీ శాఖ ప్రచురించిన రాక్ ఆర్ట్స్ సైట్స్ ఇన్ తెలంగాణ అనే పుస్తకాన్ని రాష్ట్రపతికి బహూకరించారు.

ప్రముఖులకు రాష్ట్రపతి తేనీటి విందు

ప్రముఖులకు రాష్ట్రపతి తేనీటి విందు


రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వర్షాకాల విడిది పర్యటన మంగళవారంతో ముగిసింది. బుధవారం ఉదయం 11:30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు.

 ప్రముఖులకు రాష్ట్రపతి తేనీటి విందు

ప్రముఖులకు రాష్ట్రపతి తేనీటి విందు

హకీంపేటలోని రక్షణ శాఖ విమానాశ్రయం నుంచి ప్రత్యేకవిమానంలో ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళతారని అధికారులు తెలిపారు. రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు పలకడానికి రాష్ట్రప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు ఆయనకు వీడ్కోలు పలకనున్నారు.

 ప్రముఖులకు రాష్ట్రపతి తేనీటి విందు

ప్రముఖులకు రాష్ట్రపతి తేనీటి విందు

తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఇచ్చిన విందు రాజకీయ నేతల మధ్య నెల రోజులుగా నెలకొన్న వేడిని తగ్గించినట్లు కనిపించింది. విందులో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఎదురుపడినప్పుడు ఏపీ మంత్రులు మర్యాదపూర్వకంగా నమస్కారం చేశారు.

 ప్రముఖులకు రాష్ట్రపతి తేనీటి విందు

ప్రముఖులకు రాష్ట్రపతి తేనీటి విందు

మంత్రి తారక రామారావు తన కుమారుడిని ఏపీ కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు పరిచయం చేశారు. బాగా పొడగరి అయిన అచ్చెన్నాయుడును పరిచయం చేస్తూ..‘నువ్వు కూడా అచ్చెన్న అంతా ఎత్తు ఎదుగాలి' అని చమత్కరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+