Droupadi Murmu: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
శీతకాల విడిదిలో భాగంగా హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలను సందర్శిస్తున్నారు.
ఆమె ఇప్పటికే శ్రీశైలం, భద్రాచలం, రామప్ప ఆలయాలను సందర్శించుకున్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట లక్ష్మీ నర్సింహ్మ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని రాష్ట్రపతి ద్రౌపది దర్శించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వదించారు.

హెలికాప్టర్
ఉదయం 8 గంటల 50 నిమిషాలకు రాష్ట్రపతి ముర్ము బోల్లారంలోని రాష్ట్రపతి నిలయం నుంచి హెలికాప్టర్ లో యాదగిరి గుట్టకు చేరుకున్నారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ తమిళి సై సౌందర రాజన్, మంత్రులు జగదీశ్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ఉన్నారు.

రామప్ప
నిన్న రామప్పలో పర్యటించిన ముర్ము.. పదమూడో శతాబ్దానికి చెందిన రామప్ప శిల్పాలు తనను ఎంతగానో అబ్బురపరిచాయని అన్నారు. రామలింగేశ్వర స్వామి గుడి ప్రపంచం గర్వించే దేవాలయమని చెప్పారు. మన చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. శీతాకాల విడిది కోసం ఈనెల 26వ తేదీన హైదరాబాద్ కు వచ్చారు.

రాష్ట్రపతి విందు
ఇవాళ్టితో రాష్ట్రపతి శీతాకాల విడిది ముగుస్తుంది. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన విందులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు.












Click it and Unblock the Notifications