Narendra Modi: వేములవాడ రాజన్న సేవలో ప్రధాని మోదీ..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. రాజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మోదీకి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం ఆవరణలో ఉన్న భక్తులకు మోదీ నమస్కారం చేశారు. నరేంద్ర మోదీ ఉదయం రాజ్ భవన్ నుంచి బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
ఎయిర్ పోర్ట్ నుంచ హెలికాప్టర్ వేములవాడకు చేరుకున్నారు. వేములవాడకు చేరుకున్న ప్రధాని నేరుగా రాజన్న ఆలయానికి వెళ్లారు. రాజన్నను దర్శించుకున్న తొలి ప్రధానిగా నరేంద్ర మోదీ నిలిచారు. రాజన్న దర్శనం అనంతరం మోదీ బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్నారు.

మోదీ "నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమాస్కారం. రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకోవడం నా అదృష్టం" అంటూ ప్రసంగం మొదలు పెట్టారు. మూడో దశ పోలింగ్ తర్వాత కాంగ్రెస్, ఇండియా కూటమి పని అయిపోయిందని చెప్పారు. ఇండియా కూటమి మూడోస్థానానికి పడిపోయిందని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ అడ్రస్ కనిపించడం లేదన్నారు. మా ప్రభుత్వం పీవీ నరసింహరావును భారతరత్నతో సత్కరించిందన్నారు.
దేశ భద్రతకే బీజేపీ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుందని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలది అవినీతి బంధమని విమర్శించారు. ఆ పార్టీల మధ్య స్పష్టమైన అవగాహన ఉందని ఆరోపించారు. కరీంనగర్ లో బండి సంజయ్ భారీ మెజారిటీతో గెలుస్తారని చెప్పారు.












Click it and Unblock the Notifications