తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మోడీ
రెండు తెలుగు రాష్ట్రాలు ప్రగతి పథంలో నడవాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆకాంక్షించారు.ఈ మేరకు ఆయన రెండు రాష్ట్రాల ప్రజలకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలు ప్రగతి పథంలో నడవాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆకాంక్షించారు.ఈ మేరకు ఆయన రెండు రాష్ట్రాల ప్రజలకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ఆవిర్బావదినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సిరిసంపదలతో ముందుకు వెళ్ళాలని ఆయన ఆకాంక్షను వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలను హుషారైన వారిగా పేర్కొన్నారు. అభివృద్ది పథంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్త శిఖరాలను చేరుకోవాలనుకొన్నారు. దేశ ప్రగతిలో తన పాత్రను ఏపీ కొనసాగించాలని ఆయన కోరుకొన్నారు.
విదేశీ పర్యటనలో ఉన్న మోడీ ఈ మేరకు ట్విట్టర్ ద్వారా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఆయన రష్యా దేశంలో పర్యటిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఫ్రాన్స్ కు వెళ్ళనున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలు ప్రగతి పథంలో నడవాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆకాంక్షించారు.ఈ మేరకు ఆయన రెండు రాష్ట్రాల ప్రజలకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.












Click it and Unblock the Notifications