జిఎస్‌టి ఎఫెక్ట్: ఎంఆర్‌పి ధరలకు విక్రయిస్తే జైలుకే, భారీగా తగ్గిన ఆటోమొబైల్ ధరలు
జిఎస్‌టి అమల్లోకి వచ్చిన తర్వాత కూడ పాత ధరల ప్రకారంగానే వస్తువులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
హైదరాబాద్: జిఎస్‌టి అమల్లోకి వచ్చిన తర్వాత కూడ పాత ధరల ప్రకారంగానే వస్తువులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని ప్రభుత్వం హెచ్చరించింది. అక్రమాలకు పాల్పడే ట్రేడర్లను జైలుకు పంపాలని కూడ కేంద్రం అధికారులను ఆదేశించింది.
ఈ నెల 1వ, తేదినుండి జిఎస్‌టి అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని అమలు చేయాలనే ఉద్దేశ్యంతో కేంద్రప్రభుత్వం జిఎస్‌టిని అమల్లోకి తెచ్చింది.
Recommended Video

జిఎస్‌టి అమల్లోకి వచ్చి వారం రోజులు దాటినా ఇంకా కూడ కొత్త చట్టం అమల్లోనూ, రేట్ల అమలుపై కూడ అనుమానాలు , ఆందోళనలు కొనసాగుతున్నాయి.
అయితే తెలంగాణ ప్రభుత్వం జిఎస్‌టి అమలు వల్ల రాష్ట్రానికి ప్రయోజనమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అంతేకాదు ట్రేడర్లకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని కూడ ఆదేశించింది.
సుమారు 1200 రకాల వస్తువులపై జిఎస్‌టి ప్రభావం కన్పిస్తోంది. దీని ప్రభావంతో కొన్ని రకాల వస్తువుల ధరలు తగ్గితే మరికొన్ని వస్తువుల ధరలు పెరిగాయి.

ఎంఆర్‌పి ధరల వివాదం
జూలై ఒకటో తేది తర్వాత మార్కెట్లో విక్రయించే అన్ని సరుకులకు జిఎస్‌టి రేట్లు వర్తిస్తాయి. అయితే వ్యాపారస్తులు పాత సరుకును పాత రేట్లతోనే విక్రయిస్తున్నాు. జిఎస్‌టి కారణంగా తగ్గాల్సిన ధరలు తగ్గడం లేదు. పలు సర్వీసులకు రేట్లను పెంచేశారు. పాత ధరలతో పాటు కొత్త ధరలు కూడ ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. ఈ బాధ్యతను ఉత్పత్తి సంస్థలపై పెట్టారు. లేకపోతే జరిమానా, జైలు శిక్షలను అమలు చేస్తామని కేంద్రం హెచ్చరించింది. అయితే ఇంకా సర్వీస్ ట్యాక్స్ పేరుతో వినియోగాదారులపై భారం వేస్తున్నారు.

రూ. 20 లక్షలలోపు టర్నోవర్ ఉన్నా పన్ను
వార్షిక టర్నోవర్ రూ.20 లక్షలలోపున్నా సంస్థలను జఎస్‌టి నుండి మినహయించింది. లక్షల సంఖ్యల్లో ఉన్న చిన్న సంస్థలు, ట్రేడర్లకు ఈ రాయితీ ఉపశమనాన్ని ఇచ్చింది. అయితే రూ. 20 లక్షలలోపు టర్నోవర్ ఉన్న సంస్థలైనా సరే ఇరుగుపొరుగు రాష్ట్రాలకు సరుకులను ఎగుమతి చేస్తే మాత్రం జిఎస్‌టి కింద నమోదుచేసుకోవాల్సి ఉంటుంది.

నోడల్ అధికారుల నియామకం
జిఎస్‌టి అమల్లో ఎదురౌతున్న ప్రాథమిక అవరోధాలను అధిగమించేందుకుగాను కేంద్రం చర్యలను చేపట్టింది. దేశవ్యాప్తంగా సుమారు 15 మంది నోడల్ అధికారులను నియమించింది. దేశవ్యాప్తంగా ఉన్న జిల్లాలను గ్రూపులుగా విభజించి ఆయా నోడల్ అధికారుల పర్యవేక్షణలోకి తెచ్చారు. కేంద్రంలోనూ 15 మంది కార్యదర్శుల స్థాయి కమిటీని ఏర్పాటుచేశారు.ఈ కమిటీ ప్రతివారం కూడ ఈ విషయమై సమీక్ష నిర్వహించనున్నారు.

పాఠ్యాంశంగా జిఎస్‌టి
జిఎస్‌టిని సిఎలో ఓ సబ్జెక్ట్‌గా చేరుస్తున్నట్టు ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. పలు ప్రాంతాల్లో నాలుగు నుండి వారం రోజులపాటు కోర్సులు, వర్క్‌షాప్‌లను ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఢిల్లీ యూనివర్శిటీ బికామ్, బిఏ పాఠ్యాంశాల్లో జిఎస్‌టి ని చేర్చనున్నట్టు ప్రకటించింది.

ఆటోమొబైల్ ధరల తగ్గుదల
జిఎస్‌టి ప్రభావంతో ఆటోమెబైల్ ధరలు తగ్గుతున్నాయి. తగ్గించిన ధరలకే వాహనాలకు విక్రయిస్తున్నట్టుగా ఆ సంస్థలు ప్రకటించాయి. హీరో మోటాకార్స్ కొన్ని మోడల్స్‌పై రూ.1800ల నుండి రూ.4వేలవరకు తగ్గించింది. టివిఎస్ ప్రారంభ మోడల్స్, మధ్యతరహ మోడల్స్ పై రూ. 350 నుండి రూ.1500 వరకు ధరలను తగ్గించింది. ప్రీమియం విభాగంలో రూ.4,150వరకు తగ్గించింది.మారుతి సుజుకి, టోయోటా, కిర్లోస్కర్, జెఎల్‌ఆర్, బిఎండబ్ల్యులు మోడల్స్‌ను బట్టి రూ. 2300 లనుండి రూ 2 లక్షలవరకు ధరలను తగ్గించాయి.












Click it and Unblock the Notifications